Rudrudu Movie Review : హారర్ మరియు మాస్ సినిమాలతో సౌత్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పర్చుకున్న నటుడు రాఘవ లారెన్స్.ఈయన చేసిన సినిమాలకు మాస్ ఆడియన్స్ లో ఉండే క్రేజ్ వేరు.కాంచన సిరీస్ తో తెలుగు లో ఆయన సృష్టించిన బాక్స్ ఆఫీస్ ప్రభంజనం ఎలాంటిదో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.ఈ సిరీస్ తర్వాత నుండే రాఘవ లారెన్స్ అనే పేరు మాస్ లో ఒక బ్రాండ్ గా మారిపోయింది.సరైన మాస్ సినిమా కోసం అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఎదురు చూస్తున్న సమయం లో ఆయన నేడు ‘రుద్రుడు’ అనే సినిమా ద్వారా మన ముందుకి వచ్చాడు.ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా..?, మాస్ ఆడియన్స్ కి లారెన్స్ ని ఈ చిత్రం మరింత దగ్గర చేసిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
రుద్ర (లారెన్స్) అనే అబ్బాయి అందరూ కుర్రాళ్ళు లాగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ కాలాన్ని గడిపే అబ్బాయి.తన తల్లితండ్రులు అంటే ఆయన పంచప్రాణాలు.జీవితం అలా సాఫీగా సాగిపోతున్న సమయం లో రుద్ర జీవితం లోకి అనన్య(ప్రియా భవాని శంకర్) వస్తుంది,ఆమెని చూసి చూడంగానే ప్రేమలో పడిపోయిన రుద్ర ఆమెని పెళ్లి చేసుకొని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తాడు.
అతను విదేశాల నుండి తిరిగి వచ్చేలోపే తల్లి (పూర్ణిమ భాగ్యరాజ్) మరియు అనన్య చనిపోయి ఉంటారు.కొన్నాళ్ళకు వీళ్లిద్దరి మరణం సాధారణమైనది కాదని, వైజాగ్ లో పేరు మోసిన డాన్ భూమి ( శరత్ కుమార్) చేత చంపబడ్డారని తెలుస్తుంది,ఇంతకీ భూమి రుద్ర కుటుంబాన్ని చంపడానికి కారణం ఏమిటి ..?, చివరికి భూమి పై రుద్ర ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే స్టోరీ.
విశ్లేషణ :
ఇలాంటి రొటీన్ కమర్షియల్ సినిమాలను మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము, కానీ కొంతమంది దర్శకులు రొటీన్ అయ్యినప్పటికీ కూడా టేకింగ్ లో కొత్తదనం చూపించి మార్కులు కొట్టేస్తూ ఉంటారు.కానీ ఇప్పుడు కమర్షియల్ కరువు లో ఉన్న జనాలకు, రెండు గంటలపాటు బోర్ కొట్టకుండా టైం పాస్ అయ్యే విధమైన కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా అయితే చాలు, టికెట్స్ తెంపేస్తున్నారు. అలాంటి ఆడియన్స్ కి రుద్రుడు ఒక మంచి ఛాయస్ అనే చెప్పొచ్చు.సినిమా చూస్తున్నంతసేపు రొటీన్ సినిమా అనే భావన కలిగినా, కమర్షియల్ హంగులు సరిగ్గా ఉండడం తో మంచి టైం పాస్ ఎంటర్టైనర్ గా నిలిచింది.
సాంకేతికంగా కూడా ఈ సినిమా ఉన్నతం గా ఉంది, ఇక నటీనటుల విషయానికి వస్తే లారెన్స్ ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి లాంటిది, వన్ మ్యాన్ షో లెక్క అద్భుతంగా నడిపించాడు ఈ చిత్రాన్ని. డ్యాన్స్ ఆయన అదరగొడుతాడు అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఫైట్స్ కూడా ఆడియన్స్ కి రోమాలు నిక్కపొడుచుకొని రేంజ్ లో చేసాడు. ఇక విలన్ గా శరత్ కుమార్ నటన బాగుంది, మరియు ఆయన పాత్ర శక్తివంతంగా కూడా ఉంది.కానీ చివరికి హీరోనే హైలైట్ అవ్వాలి కాబట్టి చివరి 30 నిమిషాల్లో లారెన్స్ తన నట విశ్వరూపాన్ని చూపించేసాడు.ఈ సినిమా కమర్షియల్ గా ఒకవేళ పెద్ద హిట్ అయితే మాత్రం చివరి 30 నిమిషాల వల్లే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
చివరి మాట :
రొటీన్ కమర్షియల్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఈ సినిమాని చూడొచ్చు, కొత్త దానం కోరుకునేవాళ్ళు ఈ చిత్రానికి దూరంగా ఉండడమే మంచిది.
నటీనటులు :
రాఘవ లారెన్స్, ప్రియా భవాని శంకర్, నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్, శరత్ కుమార్
డైరెక్టర్ : కత్తిరేషన్
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు : ఠాగూర్ మధు
రేటింగ్ : 2.5/5