Book My Show : అట్లుంటది ప్రభాస్ ఫ్యాన్స్ తోటి.. దెబ్బకు ‘బుక్ మై షో’ సైటే క్రాష్ అయింది

- Advertisement -


Book My Show : పాన్ ఇండియా హీరో ప్రభాస్ రేంజ్ ప్రస్తుతం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ఆయన నటించిన‌ సినిమా సలార్. కే జి ఎఫ్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్‌ దర్శక‌త్వంలో రూపొందిన ఈ మూవీ క్రిస్మస్ కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. ఇక సలార్‌ టికెట్స్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలిమ్స్‌, నైజం లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ త‌మ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.

prabhas
prabhas

దీంతో మంగళవారం రాత్రి 8:24 గంటలకు ఫ్యాన్స్ అంతా బుక్ మై షో యాప్ ను ఒకేసారి ఓపెన్ చేశారు. తెలంగాణ, ఏపీ థియేటర్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేయడమే ఆలస్యం వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ లక్షలాదిమంది ఒక్కసారిగా బుక్ మై షో ఆప్ ను ఓపెన్ చేయడంతో యాప్ కాసేపు క్రాష్ అయింది. ఇక బుక్ మై షో క్రాష్ అవ్వడంతో పలువురు ఈ పిక్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో భాగంగానే బాహుబలి ప్రొడ్యూసర్ లో ఒకరైన శోభు యార్లగడ్డ కూడా సలార్ ఎఫెక్ట్.. బుక్ మై షో క్రాష్ అంటూ ట్యాగ్ చేసి ఆ ఇమేజ్ షేర్ చేశారు.

యాప్ క్రాష్ కావడంతో ఆగిపోయిన బుకింగ్స్ నిలిచిపోవడంతో.. యాప్ నిర్వాహకులు అన్ని థియేటర్స్ ను ఒకేసారి టికెట్స్ బుకింగ్‌కి ఓపెన్ చేయకుండా నెమ్మదిగా ఒక్కొక్క థియేటర్ బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఇలాగే గ‌త‌ంలో నందమూరి బాల‌య్య హోస్ట్‌గా వ్యవహరించిన అన్‌స్టాప‌బుల్ టాక్ షో కి ప్రభాస్ గెస్ట్ గా వచ్చినప్పుడు కూడా ఆ షో స్ట్రీమింగ్ రోజున ఒకేసారి కోట్లల్లో జనం ఓపెన్ చేశారు. దీంతో అప్పుడు ఆహా యాప్ క్రష్ అయింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. ప్రభాస్ అన్నతో అట్లుంటది అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here