Raja Saab సినిమాని మిస్ చేసుకున్న ఆ అన్ లక్కీ హీరో ఎవరో తెలుసా..?

- Advertisement -


Raja Saab ప్రభాస్ ఈ పేరు గురించి తెలియని వారుందరు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ప్రభాస్. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన సలార్ సినిమాతో అభిమానుల ఆకలిని తీర్చాడు. ఈ సినిమా డిసెంబర్ 22న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించింది. బాహుబలి తర్వాత అలాంటి హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ అభిమానుల కోరిక తీర్చింది ఈ సినిమా.

ఈ సంక్రాంతికి ప్రభాస్ నుంచి ఓ అప్ డేట్ వచ్చేసింది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాకి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ లుక్ లో ప్రభాస్ చాలా బాగున్నాడు. బ్లాక్ షర్ట్ తో లుంగీ తో.. మాస్ మసాలా లుక్ లో కనిపిస్తున్నాడు. కాగా ఈ సినిమాను మొదటగా డైరెక్టర్ మారుతి.. న్యాచురల్ స్టార్ నానికు వివరించారట. నాని ఈ సినిమా చేస్తే బాగుంటుందని ఆశపడ్డాడట.

ఎందుకో తెలియదు కానీ కొన్ని కారణాల చేత నాని ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట . ఆ తర్వాత ఈ కథను చాలామంది హీరోల వద్దకు తీసుకెళ్లిన ఫైనల్లీ కొన్ని మార్పులు చేర్పులతో ప్రభాస్ కు చెప్పగానే ఓకే చేశాడు. ఈ సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లింది. ఈ సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట . ఈ సినిమా అంతా ఒక థియేటర్ కి సంబంధించి రన్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఫుల్ హర్రర్, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్క బోతుందట. ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here