Anil Ravipudi : భగవంత్ కేసరి 2 ఉంది కాకపోతే బాలయ్య హీరో కాదు.. ట్విస్ట్ ఇచ్చిన అనిల్ రావిపూడి

- Advertisement -


Anil Ravipudi : టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాను సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించారు. ఇందులో కాజల్, శ్రీలీల నటించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.100కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

Anil Ravipudi
Anil Ravipudi

అంతేకాదు బాలయ్య నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని ఆయనను నందమూరి ఫ్యాన్స్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమా ఇంత భారీ సక్సెస్ కావడంతో భారీ స్థాయిలో సెలబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా పాల్గొన్న బాలకృష్ణ లుక్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు వేడుకకు వచ్చిన నందమూరి ఫ్యాన్స్ భగవంత్ కేసరి 2 పై అప్డేట్ ఇవ్వమని ప్రశ్నించారు.

దీంతో సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ‘ఇప్పటికే ఈ బరువు మోయలేక పోతున్నాను. ఒకవేళ బాలయ్య బాబు కచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తే .. త్వరలోనే భగవంత్ కేసరి 2 కూడా ఉంటుంది’ అంటూ హింట్ ఇచ్చారు. అయితే అభిమానులు మాత్రం భగవంత్ కేసరి 2 చిత్రాన్ని కనుక తెరకెక్కించాలని అనుకుంటే తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా పెట్టి బాలయ్యను తండ్రి పాత్రకు తీసుకుని సినిమాను డైరెక్ట్ చేయాలని కోరుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here