Bhagavath Kesari : అక్షరాల 2 మిలియన్ టిక్కెట్లు..ఎవరికీ సాధ్యం కానీ రికార్డ్ నెలకొల్పిన ‘భగవంత్ కేసరి’

- Advertisement -

Bhagavath Kesari : నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం ఈ దసరా కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి వీకెండ్ లో తమిళ క్రేజీ మూవీ ‘లియో’ కారణంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ విషయం లో కాస్త తడబడినా, ఆ తర్వాత పండగ సెలవుల్లో మాత్రం అన్నీ చిత్రాల మీద భారీ లీడ్ ని తీసుకుంది.

Bhagavath Kesari
Bhagavath Kesari

మొదటి వీకెండ్ వసూళ్లను చూసి కచ్చితంగా కనీసం 15 కోట్ల రూపాయిలు బయ్యర్స్ నష్టపోతారేమో అని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమాకి దసరా పండగ సెలవులు కలిసి వచ్చాయి. మొదటి ఆరు రోజుల్లోనే 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ మార్కుని సాధించి బయ్యర్స్ లో ఉన్న అపోహలను తొలగించింది. ఇక ఈ ఒక్క వీకెండ్ బాగా ఆడితే కచ్చితంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా దాటేస్తుంది.

ఇకపోతే బుక్ మై షో మరియు పేటీఏం లెక్కల ప్రకారం ఈ సినిమాకి ఇప్పటి వరకు రెండు మిలియన్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. రీసెంట్ సమయం లో ఒక టాలీవుడ్ చిత్రానికి ఈ రేంజ్ లో టిక్కెట్లు అమ్ముడుపోవడం ఈ చిత్రానికే దక్కింది. బాలయ్య బాబు తో ఇంతటి ఎమోషనల్ సినిమా తీసి సక్సెస్ అయ్యాడంటే అనిల్ రావిపూడి దర్శకత్వ ప్రతిభ కి మెచ్చుకోవాల్సిందే.

- Advertisement -

ప్రముఖ నిర్మాత దిల్ రాజు లెక్కల ప్రకారం ఈ సినిమాకి లాంగ్ రన్ ఇప్పట్లో ఆగదని, కచ్చితంగా మరో రెండు మూడు వారాలు లాంగ్ రన్ ఉంటుందని అంటున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ రోజు రోజుకి ఈ సినిమాకి పెరుగుతూ పోతున్నారట. ఫుల్ రన్ లో కచ్చితంగా 75 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here