Prabhas : అవును పైన మీరు చదివింది నిజమే. ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు ఎగిరి గంత్తెసి.. పడి దొర్లే మంచి శుభవార్త. ఇన్నాళ్లు ప్రభాస్ మల్టీ స్టారర్ సినిమాలు చేయడు.. చేసినా ఆయనే హీరోగా ఉండాలి. ఆయనకు అలాంటి ఓ పిచ్చి ఎక్కువ అంటూ కొందరు ఆకతాయిలు భయంకరంగా ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళ నోర్లు మూయించేలా ప్రభాస్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ఇటు ఇండస్ట్రీలో.. అటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఓ పెద్ద మల్టీస్టారర్ మూవీలో భాగస్వామ్యం కాబోతున్నాడట.
గతంలో బాహుబలి సినిమాలో రానా దగ్గుబాటి తో స్క్రీన్ పంచుకున్నారు ప్రభాస్.. మళ్లీ ఇప్పుడు ఇద్దరు హీరోలుగా నటించే సినిమాలో ప్రభాస్ వన్ అఫ్ ది హీరోగా ఎంపిక అయ్యాడట. ఆ సినిమా మరేదో కాదు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్ మీడియాని ఈ వార్త షేక్ ఆడించేస్తుంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది మామూలు సినిమా కాదని.. బిగ్ మల్టీ స్టారర్ సినిమా అని .. ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు అని సమాచారం. ఇది కేవలం హీరో రోల్ నే కాదు.. అలా అని అతిథి పాత్ర కూడా కాదు ..ఈ సినిమా కథనే ఏకంగా మలుపు తిప్పే పాత్ర అంట. ఇలాంటి లుక్ లో ఇప్పటివరకు మనం ప్రభాస్ ని ఎప్పుడు చూడలేదని ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఫర్ ద ఫస్ట్ టైం కెరీర్లో ప్రభాస్ ఇలాంటి పెద్ద సాహసమే చేస్తుండడం గమనార్హం.