Sandeep Reddy Vanga : ఆ సినిమాపై నెగిటివ్ కామెంట్స్.. బాలీవుడ్ నటుడికి గట్టిగా ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ

- Advertisement -

Sandeep Reddy Vanga : ‘కబీర్‌సింగ్‌’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అప్పటివరకు సరైన హిట్ లేక అల్లాడుతున్న షాహిద్ కపూర్ కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాపై అప్పట్లో చాలా మంది నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే మూవీ రిలీజ్ అయిన ఇన్నేళ్ల తర్వాత ఓ బాలీవుడ్ నటుడు మరోసారి కామెంట్స్ చేశాడు. అయితే అతను ఈ చిత్రంలో నటించడం గమనార్హం. తాను నటించిన సినిమా గురించి నెగిటివ్ వ్యాఖ్యలు చేసిన ఆ వ్యక్తి ఎవరంటే..?

కబీర్ సింగ్ మూవీలో కాలేజీ డీన్‌ పాత్ర పోషించిన బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అదిల్‌ హుస్సేన్‌ ఆ చిత్రంపై సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దృష్టికి రావడంతో ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు పెడుతూ ఆదిల్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిండు. ఇంతకీ ఐదేళ్ల క్రితం విడుదలైన సినిమాలో నటించిన నటుడిపై సందీప్‌ ఎందుకు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తంచేశారంటే..?

- Advertisement -

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిల్‌ హుస్సేన్‌ ..  ‘‘ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ‘ఎందుకు నటించానా?’ అని ఫీలైన చిత్రం ‘కబీర్‌ సింగ్‌’. అందులో కాలేజీ డీన్‌గా వర్క్‌ చేశా. ఎన్నిసార్లు నో చెప్పినా.. ఒకేఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. దాంతో వెళ్లి చెప్పిన సీన్‌ యాక్ట్‌ చేసి వచ్చేశా. ఆ సీన్‌ మంచిగా అనిపించింది. సినిమా కూడా అలాగే ఉంటుందని భావించా. విడుదలయ్యాక ఆ సినిమా చూసి.. ‘‘ఇలాంటి చిత్రంలో ఎందుకు నటించానా?’’ అని ఇబ్బందికరంగా ఫీలయ్యానని కామెంట్స్ చేశారు.

దీనిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందిస్తూ..  ‘‘మీరు గొప్పగా భావించి నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని ఫీలవుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో మీ సొంతమైంది. నటనపై అభిరుచి కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నా. ఇకపై మీరంత సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తా. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్‌ చేస్తా’’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఈ పోస్టు చూసిన నెటిజన్లు రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నావ్ బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఇద్దరి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here