Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే.. ఒకప్పుడు స్టార్ హీరో.. కానీ ఇప్పుడు ప్రపంచం మెచ్చిన గ్లోబల్ స్టార్ హీరో.. రాజమౌళి తెరకేక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా తో వరల్డ్ ఫెమస్ హీరో అయ్యాడు.. దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది.. ముఖ్యంగా లేడీస్ ఫాలోయింగ్ పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు.. ఈయన పేరును టాటూగా వేయించుకోవడం దగ్గరనుంచి నా హీరో నా హీరో అంటూ కొట్టుకోవడం విశేషం.. ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న వీడియో వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

చరణ్ సినిమా విడుదల అవుతుంది అంటే మెగా ఫ్యాన్స్ హడావిడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కటౌట్లు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలతో రచ్చ రచ్చ చేస్తారు ఫ్యాన్స్.. ఆ సినిమా హిట్ అయితే వారి సంతోషానికి అవధులు ఉండవు.. ఇటీవల ట్రిపుల్ ఆర్ కు ఆస్కార్ రావడంతో ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తూ సంబరాలు చేసుకున్నారో తెలిసిందే.. ఇక తాజాగా రామ్ చరణ్ కోసం ఇద్దరు అమ్మాయిలు నడిరోడ్డు పై పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. దాన్ని చూసిన వారంతా కూడా నోట మాట రాకుండా విస్తూపోయి చూస్తుండి పోయారు..
రామ్ చరణ్ ను ఒక చిన్న మాట అన్నందుకు ఇద్దరు అమ్మాయిలు ఇలా రోడ్డు మీద పడి కొట్టుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది… ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే..ఇప్పుడు మరో సినిమాను చేయనున్నారు.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..