Kriti Sanon : బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోయే స్పెషల్ పర్సన్ …ప్రభాసే.. ఎక్సైట్ అవుతున్న నెట్టిజెన్స్..

- Advertisement -

Kriti Sanon : గత కొద్దికాలంగా ప్రభాస్ ,కృతి సనన్ మధ్య ఏదో నడుస్తోంది అన్న వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఆదిపురుష్ మూవీ టైం నుంచి ఈ రూమర్స్ మరీ ఎక్కువగా ఉన్నాయి. మూవీ రిలీజ్ తర్వాత ఇలాంటి వార్తలు కాస్త కానీ సడెన్ గా మరోసారి ఈ డిస్కషన్ తెరపైకి వచ్చింది.కృతి సనన్ సోషల్ మీడియాలో రీసెంట్ గా పెట్టిన పోస్ట్ దీనికి కారణం.

Kriti Sanon
Kriti Sanon

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి ఛాన్స్ దొరికితే ప్రభాస్ ని వివాహం చేసుకుంటాను అని చెప్పిన తర్వాత నుంచి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని అందరూ భావించడం మొదలుపెట్టారు. దీనికి తోడు ఉమైర్ సందు త్వరలోనే వీళ్లిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగబోతోంది అని పెట్టిన ట్వీట్ ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనితోపాటు బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కృతి మనసు మొత్తం ప్రభాస్ దగ్గరే ఉంది అని చేసిన కామెంట్ స్ వైరల్ అయ్యాయి.

తాజాగా కృతి తన సోషల్ మీడియాలో ఈ సంవత్సరం తన పుట్టిన రోజు ఒక స్పెషల్ పర్సన్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని పోస్ట్ పెట్టింది. ఒక సంవత్సరం నుంచి నేను మీ అందరి దగ్గర ఇది సీక్రెట్ గా ఉంచుతున్నాను కానీ ఇక దాచాల్సింది ఏమీ లేదు…వెయిట్ చేయడం ఇక ఇష్టం లేదు.. అంటూ ఒక H అనే లెటర్ కనిపిస్తున్న వీడియోని పోస్ట్ చేసి దానికి ఈ క్యాప్షన్ పెట్టింది.

- Advertisement -

ఈ వీడియో చూసిన నెటిజన్స్ కొందరు ప్రభాస్ పేరు లో H లెటర్ ఉంటుంది కాబట్టి అది ప్రభాస్ పేరుని రివీల్ చేసే వీడియో అని భావిస్తున్నారు. మరికొందరు హెచ్ అంటే ప్రభాస్ ఎలా అవుతుంది అని సెటైర్లు వేస్తున్నారు. ఇంకొంతమంది ఆమె నటించబోయే సరికొత్త చిత్రం హీరోపంతి-2 గురించి రివ్యూ చేయబోతుందేమో అని అంటున్నారు. మొత్తానికి ఏం జరుగుతుందో తెలియదు కానీ కృతి పెట్టిన ఈ వీడియో మాత్రం పాత సంగతులు నమ్మించి బయటకు తీస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here