Kiran Rathod : నన్ను వాడుకోవాలని చూస్తున్నారు.. ఘూటు వ్యాఖ్యలు చేసిన కిరణ్ రాథోడ్..

- Advertisement -

Kiran Rathod : తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్దగా పరిచయం లేకపోయినా ‘ నువ్వు లేక నేను లేను ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈవిడ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈవిడ కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా అదరగొట్టింది. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లోనూ నటించింది ఈ భామ. నిజానికి ఈవిడ హీరోయిన్ కంటే చాలా వరకు స్పెషల్ సాంగ్స్ లోనే ఆడిపాడిందని చెప్పవచ్చు.

Unbelievable! Actress Kiran loses 20 kgs in short time and shares the  secret - Tamil News - IndiaGlitz.com

 

- Advertisement -

తమిళ స్టార్ హీరోలు దళపతి విజయ్, కమల్ హసాన్ వంటి స్టార్ హీరోల సరసన స్టెప్పులేసింది. అయితే ఈ హాట్ బ్యూటీ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే తెలుగులో నిర్వహించిన బిగ్ బాస్ సీజన్ 7 లో ఈవిడ పాల్గొంది. కాకపోతే ఈ సీజన్ లో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. మళ్లీ ఇప్పుడిప్పుడే కెమెరా ముందుకు వస్తోంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో ప్రయత్నిస్తుంటే తనను కొంతమంది తప్పుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని చెప్పుకొచ్చింది. కొందరైతే అడ్జెస్ట్మెంట్ అడుగుతున్నారని చెప్పుకొచ్చింది.

Veteran actress Kiran Rathod's latest glamour photos make fans scream -  News - IndiaGlitz.com

 

ఇంతటి కష్టసమయంలోనే తన ప్రియుడు తనని వదిలేశాడని తెలిపింది. అంతేకాకుండా ఓసారి తన ప్రియుడు తనను కొట్టాడడని కూడా చెప్పుకొచ్చింది. అయితే అదే తాను సహించలేకపోయిందట. ఆ తర్వాత తన ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని పిలిచి.. కసితీరా కొట్టి పంపించిందట ఈ వయ్యారి. ఇక అప్పడి నుండి కొందరు ఇండస్ట్రీలో తప్పుడు ఉద్దేశంతో తనను వాడుకోవాలనుకున్నారని తెలిపింది. దీనితోనే తనకు సినిమా అవకాశాలు దూరమయ్యాయి అని తెలిపింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here