Kalki : ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాగ్ న్యూస్.. కల్కి వాయిదాకు ఇదే కారణమా..!

- Advertisement -

Kalki పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగజ్జ తారలు ప్రధాన పాత్రలు పోషించారు ఇందులో. వీటితోపాటు ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార దిశా పటానీతో స్పెషల్ సాంగ్ కూడా సందడి చేయనుంది. ఇక ఈ సినిమాను మన తెలుగు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

భారీ బడ్జెట్‌ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై సి అశ్వినిదత్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇకపోతే సినిమాకి సంబంధించి దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి సినిమా.. మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది. కాకపోతే ఈ తేదీకి ప్రభాస్ సినిమా రిలీజ్ కావట్లేదన్న అనేక ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

తాజాగా ఈ సినిమా మూవీ రిలీజ్ డేట్ పై అమితాబ్ బిగ్ అప్డేట్ కూడా ఇచ్చారు. కల్కి షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని.. ముందుగా చెప్పినట్లుగా మే 9న సినిమా విడుదల కానుందన్నారు. ఇక ఈ వార్త విన్న ప్రభాస్ అభిమానులు బాగా సంతోషించారు. అయితే తాజాగా విడుదలైన ఎన్నిక షెడ్యూల్ నేపథ్యంలో ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం లేకపోలేదు. దీనికి కారణం దేశంలో ఎన్నికలు పలు విడతలలో జరగడమే. అందులోనూ తెలుగు రాష్ట్రాలలో మే 13 న పోలింగ్ ఉండడంతో మరి ఈ సినిమా రిలీజ్ అవ్వడం డౌట్ గానే కనపడుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here