kiara advani : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్ కలసి ఓ భారీ ప్రాజెక్టు చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. చెర్రీ కెరీర్ లో 15వ చిత్రంగా తెరకెక్కుతోంది. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తారని మేకర్స్. ఈ టైటిల్ చాలా బాగుందంటూ మెగా అభిమానులతో పాటు, సినీ లవర్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అటు శంకర్ సైతం ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అందుకే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని సెలెక్ట్ చేశారు.

ఇంత వరకు బానే ఉన్నా.. తాజగా ఓ ఫొటోగ్రాఫర్ చేసిన పని టీం మొత్తానికి ఆగ్రహం తెప్పించింది. కియారా న్యూడ్ ఫొటోను షేర్ చేశాడు ఓ ఫొటో గ్రాఫర్. దీంతో పలువురు నెటిజన్లు ఇలాంటి అమ్మాయిని రామ్ చరణ్ పక్కన తీసుకోవద్దంటూ గోల చేస్తున్నారుట. 2021లో ఫ్యాషన్ క్యాలెండర్ కోసం డబురత్నాని ఓ ఫోటో షూట్ చేశారు. అందులో కియారా అద్వానీ కూడా ఉన్నారు. శరీరం మీద ఒంటి పోగు లేకుండా ఒక ఆకు వెనుక నిల్చున్నట్లున్న కియారా అద్వానీ ఒక ఫోజ్ ఇచ్చారు. అప్పట్లో కియారా నగ్న ఫోటో సోషల్ మీడియాలో సంచలనం రేపింది. అప్పటి త్రో బ్యాక్ ఫోటోను డబురత్నాని మరోసారి షేర్ చేశారు. అయితే ఈ ఫొటో వివాదాస్పదంగా మారడమే కాకుండా ఆమె సినిమా ఆఫర్ల మీద కూడా ఎఫెక్ట్ పడేలా ఉంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కియారా బాలీవుడ్ కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్ర (Sidharth Malhotra)ని పెళ్లి చేసుకున్నారు. జైసల్మేర్‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ మీడియా ఎప్పుడు అడిగినా…‘అలాంటిది ఏమీ లేదు. మేం మంచి స్నేహితులం’’అనే చెప్పేవారు. ఈ ఇద్దరూ కలసి ‘షేరా’్ష చిత్రంలో నటించారు. కియారా తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రామ్‌చరణ్-శంకర్ కలయికలో వస్తోన్న చిత్రంలో నటిస్తోంది. అయితే ఒకప్పటి న్యూడ్ చిత్రం ఇప్పుడు కియారాకు పెద్ద తలనొప్పిగా మారింది.