Akhil Akkineni : ఈ సినిమా తర్వాత నా పరిస్థితి తలచుకుంటేనే భయం వేస్తుంది..’ఏజెంట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ కామెంట్స్

- Advertisement -

Akhil Akkineni హీరో గా నటించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్ ఈ నెల 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ మరియు టీజర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.అఖిల్ బలంగా హిట్ కొట్టబోతున్నాడు అనే నమ్మకాన్ని అభిమానుల్లో కలిగించింది రీసెంట్ గా విడుదలైన ఆ ట్రైలర్.ఈ చిత్రం లో అఖిల్ తో పాటుగా మలయాళం సూపర్ స్టార్ మమ్మూటీ కూడా నటించిన సంగతి తెలిసిందే.అయితే నిన్న సాయంత్రం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథి గా హాజరయ్యాడు.ఈ సందర్భంగా ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడిన కొన్ని మాటలను ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

Akhil Akkineni
Akhil Akkineni

ఆయన మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు అయితే నేను ఈ సినిమాని చూడలేదు, కానీ ట్రైలర్ మరియు టీజర్ ని చూస్తూ ఉంటే సురేందర్ రెడ్డి నా కొడుకుని ఎంతో ఎనెర్జిటిక్ గా చూపించాడు అనే విషయం అర్థం అవుతుంది.మీరందరు అఖిల్ ఎనర్జీ ని ఇప్పుడే చూస్తున్నారు, మేము చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాము.వాడికి 1 ఏడాది 8 నెలలు నిండిన సమయం లో చాలా ఎనర్జీ గా ఉండేవాడు.కుదురుగా ఒక చోట ఉండేవాడు కాదు, మేము వేడిని తట్టుకోలేక అప్పట్లో డాక్టర్ దగ్గరకి కూడా తీసుకెళ్ళాము.

ఇక ఈ సినిమా సక్సెస్ సాధిస్తుంది అని చెప్పడానికి నా దగ్గర రెండు కారణాలు ఉన్నాయి, షూటింగ్ చేసి ఇంటికి వచ్చినప్పుడు అఖిల్ ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ పాయింట్ మరియు ట్విస్ట్స్ చెప్పాడు.అవి నాకు చాలా అద్భుతంగా అనిపించాయి, ఇక రెండవది మలయాళం సూపర్ స్టార్ మమ్ముటి ఈ సినిమా ఒప్పుకొని చెయ్యడమే.సాధారణంగా ఆయన ఇలాంటి స్పెషల్ పాత్రలు ఇతర హీరోల సినిమాల్లో చెయ్యడానికి పెద్దగా ఇష్టపడడు.అలాంటిది ఆయనే ఒప్పుకొని చేసాడంటే ఈ సినిమా కథ ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు’ అంటూ నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

- Advertisement -
Nagarjuna

ఇక అక్కినేని అఖిల్ మాట్లాడుతూ ‘సురేందర్ రెడ్డి గారు.. మన ఇద్దరం కలిసినప్పుడు ఎదో క్రేజీ గా ప్లాన్ చేద్దాం, పిచెక్కిద్దాం అని అనుకున్నాము. చివరికి ఎదో మన ప్రయత్నం మనం చేసాము, ఆడియన్స్ థియేటర్ లో మంచి అనుభూతి పొందబోతున్నారు ఈ సినిమా ద్వారా అని అనుకుంటున్నాను.ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ చూసిన తర్వాత నా పరిస్థితి ఏమిటో, దీనికి మించి భవిష్యత్తులో నేను చేయగలనా లేదా అనే సందిగ్ధం లో పడేసారు.నా తదుపరి చిత్రాల్లో నటించడానికి ఇది పెద్ద ఛాలెంజ్’ అంటూ అఖిల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here