Ileana : ట్రెండ్ మార్చిన గోవా బ్యూటీ.. శారీలో సిగ్గులొలుకుతున్న ఇలియానా

- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానాను చూసి కుర్రకారంతా.. ‘చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా.. కలకాలం నీ కౌగిల్లే నా ఇళ్లనుకుంటా’.. అనుకుంటూ పాడుకుంటున్నారు. నెట్టింట ఈ బ్యూటీ గ్లామర్ షో చూసి ‘నొప్పి నొప్పి గుండెంత నొప్పి.. గిల్లిగిల్లి గిచ్చేస్తదే.. పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకి లాగేస్తదే’ అంటూ హమ్ చేస్తున్నారు. తరచూ గోవా బీచుల్లో ఫ్రెండ్స్​తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది Ileana .

Ileana
Ileana

 

గోవా బీచ్​లో ఎప్పుడు బికినీల్లో కనిపించే ఇలియానాకు బికినీ బ్యూటీ అనే పేరు కూడా ఉంది. ఇక బికినీ ఈ హాటీకి సూట్ అయినట్టు మరే హీరోయిన్​కు సూట్ కాదని కుర్రాళ్లు అంటుంటారు. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులో కనిపించే ఈ గోవా బ్యూటీ ఈసారి కాస్త ట్రెండ్ మార్చింది. ట్రెడిషనల్ లుక్​లో అది కూడా శారీలో తన అందాల విందు వడ్డించింది.

- Advertisement -

గ్రీన్ అండ్ రెడ్ కలర్ శారీలో ఇలియానా.. ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే.. అనేలా కనువిందు చేస్తోంది. ట్రెడిషనల్ లుక్​లో సిగ్గులొలకబోస్తూ ఈ బ్యూటీ చేసిన ఫొటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎప్పుడూ బికీనీలోనే చూసిన ఈ బ్యూటీ శారీలో సూపర్​గా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్​గా ఇలియానా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పోకిరి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రవితేజ వంటి స్టార్ల సరసన నటించి అగ్రస్థాయి హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. గ్రీన్ అండ్ పింక్ హాఫ్ శారీలో కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. తలలో తెల్ల గులాబీ ధరించి.. అచ్చమైన తెలుగమ్మాయిలా చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఎప్పుడూ బికినీలోనే కనిపించే ఈ బ్యూటీ ట్రెడిషనల్ గా కనిపించాలంటే ‘శారీ, పూలు ఇవ్వడంటూ’ క్యాప్షన్ కూడా పెట్టింది.

తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’తో వెండితెరపై మెరిసింది. పెద్దగా ఈ చిత్రం ఆకట్టుకోకపోవడంతో ఆ తర్వాత ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. బాలీవుడ్​లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ ఫిదా చేస్తోంది. రీసెంట్ గా ‘ది బిగ్ బుల్’లో అభిషేక్ బచ్చన్ సరసన నటించి అలరించింది. ప్రస్తుతం ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’,శ్రీషా గుహ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మరో చిత్రంలోనూ నటిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here