Keerthy Suresh : బంపర్ ఆఫర్ కొట్టేసిన కీర్తి సురేశ్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు టెన్షనేగా..!

- Advertisement -

Keerthy Suresh : పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను మొదటగా మే లో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ ఎన్నికల కారణంగా సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.

కల్కి తర్వాత వస్తున్న సినిమాలల్లో స్పిరిట్ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. మొన్న యానిమల్ సినిమాతో మరో హ్యాట్రిక్ హిట్ ను కొట్టాడు. దాంతో ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సందీప్ వంగ గత రెండు సినిమాలు మాదిరి గానే ఈ సినిమాలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ కొత్తగా ఉండబోతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీస్ నటించనున్నారనే వార్తలు వినిపించాయి. తాజాగా మరో పేరు వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా కీర్తి సురేష్ ను తీసుకోనున్నారని వార్త చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -

ఈ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివర్లో మొదలు పెట్టనున్నారు. ప్రభాస్ కల్కి పనులు పూర్తి చేసిన తరువాత రాజాసాబ్ ని కంప్లీట్ చేసే పని తీసుకోనున్నారు. ఈ వార్త నిజమైతే కీర్తి సురేష్ ఖాతాలో మరో హిట్ పడినట్లే అని డార్లింగ్ ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. మరోవైపు ఆమెకు వరుస ఫ్లాప్ లు ఉన్న సంగతి తెలిసి కాస్త టెన్షన్ పడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here