Karate Kalyani : తెలుగు సీనియర్ నటుడు శరత్ బాబు తీవ్ర అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.. చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని సమాచారం..ప్రస్తుతం వైద్యులు ఆయనకి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శరత్ బాబు అనారోగ్య సమస్య ఏంటి అనేది బయటకి రాలేదు. శరత్ బాబు ఆసుపత్రిలో చేరారని విషయం తెలుసుకున్న కొందరు ప్రముఖులు ఆయన్ని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఆయన అభిమానులు శరత్ బాబు త్వరగా కోలుకోవాలని పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి కూడా ఆయన కోలుకోవాలని కోరుతూ ట్వీట్ చేసింది.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

శరత్ బాబు 1973లోనే నటుడిగా మారారు. రామరాజ్యం అనే చిత్రంలో తొలిసారి నటించారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య , ఆపద్భాందవుడు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో శరత్ బాబు నటించారు. నెగిటివ్ రోల్స్ లో సైతం ఆయన మెప్పించారు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శరత్ బాబు మూడు నంది అవార్డులు అందుకోవడం విశేషం. ఇక శరత్ బాబు, రమాప్రభ మధ్య ఇప్పటికి తేలని వివాదం ఉంది. ఇక శరత్ బాబు చివరగా వకీల్ సాబ్ చిత్రంలో నటించారు..కొన్నాళ్ల క్రితం వరకు కూడా శరత్ బాబు పలు సినిమాల్లో కనిపించేవారు. తండ్రి పాత్రలతో పాటు పలు ఇతర పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించే వాడు. అయితే వృద్ధాప్యం కారణంగా సినిమాల్లో అరుదుగా కనిపిస్తున్నారు.
ఆయన ప్రస్తుతం చెన్నైలో ఆయన నివాసంలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థించారు.. నటి కరాటే కళ్యాణి సైతం శరత్ బాబు కోలుకోవాలని దేవుడిని ప్రార్థించారు. అదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. నాకు ఇష్టమైన హీరో అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు శరత్ బాబు గారు తొందరగా కోలుకోలవాని మనం స్వామిని వేడుకొందాం అంటూ ఆమె పోస్ట్ చేశారు.. నీకో దండం పెడతాము ఇలాంటి పోస్టులు పెట్టకు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది..ఇక శరత్ బాబు ఆరోగ్యం పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది…