Kalyani karate : ఈ వయస్సులో కరాటే కల్యాణికి అదే కావాలట..లేకుంటే కష్టమట..Kalyani karate : అబ్బా..బాబీ పిండేశావు..అనే డైలాగు ఎంత ఫెమస్ అయిందో అందరికి తెలుసు..ఆ ఒక్క డ్తెలాగు తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తల దూర్చి గొడవలు పెట్టుకుంటు ఎప్పుడూ ఏదోక వార్తతో పాపులర్ అవుతూ వస్తుంది. అంతేకాదు.. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కరాటే కళ్యాణి వైవాహిక జీవితంలో ఎదురైన ఇబ్బందులను తెలియజేయడమే కాకుండా మరొక పెళ్లి కావాలి అంటూ తన మనసులో మాట బయట పెట్టింది..ఈ మాట విన్న కొందరు ఈ వయస్సులో ఏం చేస్తావు అంటూ కామెంట్లు చేస్తున్నారు..

Kalyani karate
Kalyani karate :

విషయానికొస్తే.. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. నాలో అందరూ బోల్డ్ యాంగిల్ మాత్రమే చూస్తున్నారు.. నేను సిల్వర్ స్క్రీన్ పై చేసిన పాత్రలతోనే జడ్జ్ చేస్తుంటారు..పైకి రఫ్ గా కనిపించే ఈమె లోపల వేరే కోణం దాగి ఉంది..సినిమాలు బ్రతుకుతెరువు కోసం మాత్రమే చేస్తున్నాను నిజజీవితంలో నేను చాలా మందికి సహాయం చేశాను.

comedian kalyani
comedian kalyani

ముఖ్యంగా నా వ్యక్తిగత వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు కష్టాలు కూడా ఉన్నాయి. పెళ్లి తర్వాత నరకం అనుభవించాను. మాజీ భర్త టార్చర్ చేశాడు.. ఆ టార్చర్ ఎలా ఉండేది అంటే ఒకరోజు బేగంపేట వద్ద నడిరోడ్డుపై నా బట్టలు లాగేసాడు. పబ్లిక్ ముందు ద్రౌపది వస్త్రాపహరణం జరిగిందని తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకొచ్చింది..

ఇప్పటికీ మరో పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంది. నిజమైన ప్రేమ కోసం నేను పరితపిస్తున్నాను.. నన్నుగా ప్రేమించే వ్యక్తి దొరికితే పెళ్లి చేసుకుంటాను అంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది. ఇకపోతే కళ్యాణి జీవితంలో అనేక వివాదాలు కూడా ఉన్నాయి..అని ఈ మధ్య తనకు జరిగిన అన్యాయాలను ఓ యూట్యూబ్‌ చానెల్ లో చెప్పింది.

kalyani
kalyani


ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ నడిరోడ్డుపై అతడి బట్టలు చిరిగేలా కొట్టింది.పెద్ద న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఈమె ఎస్ఆర్ నగర్ పోలీసులు ఇద్దరిపై కేసులు పెట్టగా.. కంప్లైంట్ ఇచ్చిన నాపై కేసు ఎలా పెడతారు అంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగింది..ఇదే కాదు ఏది జరిగిన ఈమె పేరు అక్కడ ఖచ్చితంగా వినిపిస్తోంది.. ఇకపోతే ప్రస్తుతం సినిమాలు ఏమి చెయ్యలెదని తెలుస్తుంది..ఈమెను ఎవరైనా పెళ్ళి చేసుకొవడానికి ముందుకు వస్తారెమో చూడాలి..