వామ్మో.. ప్రభాస్ సినిమా కోసం కమల్ హాసన్ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా..!

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వరుస పెట్టి బిగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో ఒకటి ప్రాజెక్ట్ K. ఆదిపురుష్, సలార్, రాజా డీలక్స్ వంటి సినిమాలతో పాటు ప్యాన్ వరల్డ్ లెవల్‌లో ప్రాజెక్ట్ కే మూవీ రూపొందుతోంది. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన అప్ డేట్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిలో ఈ సినిమాపై ఓ రకమైన క్యూరియాసిటీ నెలకొంది.

ఇంతలో ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా భాగం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు మేకర్స్. ఖతర్నాక్ అప్ డేట్ విని ప్రభాస్, కమల్ హాసన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భాగం అవుతున్నందుకు గాను కమల్ హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రభాస్ తో పాటు ప్రాజెక్ట్ కే లో భాగం కావడానికి ఏకంగా 100 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట కమల్ హాసన్.

అదే నిజమైతే ప్రభాస్, కమల్ హాసన్ ఇద్దరి రెమ్యూనరేషన్స్ కలిపి చిత్ర బడ్జెట్ లో 50 శాతం అవుతాయి. ప్రభాస్ ఈ సినిమా కోసం 150 కోట్లు తీసుకున్నారని సమాచారం. అంటే 250 కోట్ల రూపాయలు ఈ ఇద్దరి పారితోషికాలకే పోతాయన్నమాట. కమల్ హాసన్ 100 కోట్ల రూపాయలు తీసుకోవడం అనే మాటే నిజమైతే.. ఈ సినిమాలో ఆయన రోల్ ఊహించని విధంగా ఉండొచ్చు అనే మరో టాక్ షురూ అయింది. ఏది ఏమైనా ప్రభాస్ చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్టులో కమల్ భాగం కానుండటం ఉత్కంఠ రేపే అంశం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమా 80 శాతానికిపైగా షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది.

- Advertisement -

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్‌ వరల్డ్‌ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ రెండు భాగాలుగా వస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం. ఈ సినిమా కేవలం ఒక భాగమేనని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ సంక్రాంతి విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో దిశా పటానీ కీలక పాత్రలో నటించనుంది. అందులో భాగంగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రాజెక్ట్ కే టీమ్ ఇటీవల ఆమెకు సంబంధించిన ఓ లుక్‌ను విడుదల చేసింది. ఆమెకు ప్రీలుక్‌ సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here