మరో ఉర్ఫీలా తయారైన శ్రియా.. మాయరోగమా అంటున్న నెటిజన్లు

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది శ్రియ శరణ్. ఎప్పుడో 2001లో తన తొలి సినిమా చేసింది. 22 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ తన ఫిగర్ ను కాపాడుకుంటూ వస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ ఫిల్మ్ మేకర్స్ ను ఆకర్షిస్తోంది. బాలీవుడ్ లో దృశ్యం 2 సినిమాలో తన నటనతోనూ ఆకట్టుకుంది. నాలుగు పదుల వయసు దాటినా ఇప్పటి పర్ఫెక్ట్ ఫిగర్ తో కనిపిస్తున్న శ్రియకు ఐటెమ్ సాంగ్ ఆఫర్లు కూడా వస్తుండటం విశేషం.

శ్రియా
శ్రియా

అయితే ఈ ఐటెమ్ సాంగ్ కోసం ఆమె డిమాండ్ చేస్తున్న మొత్తమే ప్రొడ్యూసర్లను షాక్ కు గురి చేస్తోంది. ఐటెమ్ సాంగ్ చేయడానికి కూడా శ్రియ రూ.కోటి అడుగుతోందట. ఓ స్టార్ హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసి కూడా పదేళ్లవుతోంది. బోల్డ్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ మత్తెక్కిస్తోంది. తాజాగా వైరెటీ డ్రెస్ ధరించిన శ్రియా.. కవర్ చేసుకునేందుకు తంటాలు పడింది. అయితే శ్రియా ధరించిన ఈ డ్రెస్‌పై నెట్టింట భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ‘ఉర్ఫీ జావేద్‌కి కాపీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శనివారం రాత్రి డెనిమ్ కటౌట్ డ్రెస్‌లో అవార్డుల ఫంక్షన్‌కు బ్లూ కట్ అవుట్ డ్రెస్‌లో శ్రియా ఆకర్షణీయంగా కనిపించింది.

SHriya saran

అయితే నెటిజన్లు ఆమె ఫ్యాషన్ వేర్‌ను విమర్శించారు. శ్రియా వీడియోపై ట్రోలింగ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రియా డ్రెస్ జారిపోతుండగా.. సైడ్‌లో హాట్ స్పాట్‌లను కవర్ చేసుకునేందుకు ఇబ్బంది పడింది. చివరకు డ్రెస్‌ను చేతితో పట్టుకుని కారులో ఎక్కి కూర్చొంది. నడుము వద్ద లోతైన కట్ అవుట్.. పక్కన మోకాలి వరకు డ్రెస్‌కు చీలికలు ఉన్నాయి. ఆఫ్ షోల్డర్ డ్రెస్‌కు అందమైన ఉపకరణాలతో యాడ్ చేసింది. లేటెస్ట్ పిక్స్‌ను శ్రియా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here