Amigos Review : తన ప్రతీ సినిమా తో ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని ఇవ్వాలనుకుంటాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. మొదటి సినిమా నుండే ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, నందమూరి కుటుంబం నుండి వస్తున్నా హీరో అంటే కచ్చితంగా అభిమానులు మరియు ఆడియన్స్ ఊర మాస్ జానర్ సినిమాలను ఆశిస్తారు.కానీ కళ్యాణ్ రామ్ వాళ్ళ అంచనాలకు బిన్నంగా కొత్త తరహా కథలతోనే ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసాడు, ఆ ప్రయత్నం లో ఆయనకీ అధికశాతం అపజయాలు ఎదురు అవ్వడం వల్ల స్టార్ హీరో కాలేకపోయాడు.

దాదాపుగా ఆయన మార్కెట్ మొత్తం సూన్యం అయిపోతున్న సమయం లో గత ఏడాది ‘భింబిసారా’ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది..ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నేడు ‘అమిగోస్’ అనే కొత్త తరహా సబ్జెక్టు తో మన ముందుకి వచ్చాడు.ఈ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకుందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం.
కథ :
ఒకే పోలికలతో ఉండే మైఖేల్ , మంజునాథ్ మరియు సిద్దార్థ్ కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా కలుసుకుంటారు.వీరిలో మైఖేల్ అనే వాడు ప్రపంచాన్ని వణికించే ఒక పెద్ద గ్యాంగ్ స్టర్, ఇతని కోసం CIA వెతుకుతూ ఉంటుంది.వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం మైఖేల్ ఈ ఇద్దరిలో కలిసిపోతాడు, ఆ తర్వాత వీళ్ళిద్దరిని వాడుకొని CIA నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు.ఈ ప్రయత్నం లో మైఖేల్ సక్సెస్ సాధించాడా, మైఖేల్ పోలికలతో ఉన్న ఆ ఇద్దరు అచ్చు గుద్దినట్టు మైఖేల్ లాగానే ఎందుకు ఉన్నారు..వీళ్ళ మధ్య రక్త సంబంధం ఏమైనా ఉందా? , ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఇలాంటి థ్రిల్లర్ జానర్ లో వచ్చే సినిమాలకు స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ బాగుండడం చాలా అవసరం, డైరెక్టర్ రాజేందర్ రెడ్డి కి ఇది మొదటి సినిమానే అయ్యినప్పటికీ చాలా చక్కగా తీసాడు, ఆడియెన్స్ ని ఎక్కడా కూడా తికమక పెట్టకుండా, ఒక కంప్లెక్స్ కథని అరటిపండు వలిచి నోట్లో పెట్టినంత తేలికగా అందరికీ అర్థం అయ్యేటట్టు ఈ చిత్రాన్ని తీసాడు.ప్రతీ ఒక్కరికి సినిమా చూసేటప్పుడు తర్వాత ఏమి జరుగుతుంది అనే ఆత్రుత కలిగించడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు, ఫస్ట్ హాఫ్ మొత్తం మూడు పాత్రలను డెవలప్ చేసాడు, సెకండ్ హాఫ్ మెయిన్ ప్లాట్ లోకి అడుగుపెట్టి కథని ఆసక్తికరంగా నడిపించాడు.

ఇక నటీనటుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కళ్యాణ్ రామ్ ఈ చిత్రం తో మరోసారి తన నటవిశ్వరూపం చూపించేసాడు..మూడు పాత్రలలో ఆయన నటించాడు అనడం కంటే జీవించాడు అని చెప్తే బాగుంటుంది, ముఖ్యంగా ‘మైఖేల్’ పాత్రలో ఆయన చూపించిన వేరియేషన్స్ అదిరిపోయాయి.హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ తన పరిధిమేరా బాగా నటించింది.గిబ్రాన్ అందించిన పాటలు పర్వాలేదు అనిపించినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టేసాడనే చెప్పాలి.టెక్నికల్ గా, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఈ సినిమా చాలా క్వాలిటీ తో తీశారు మైత్రి మూవీ మేకర్స్.

చివరి మాట :
ఎల్లప్పుడూ కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి ఈ ‘అమిగోస్’ చిత్రం ఒక కనులపండుగ లాగానే ఉంటుంది, థియేటర్స్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఒక కొత్త తరహా సినిమాని చూశామని అనుభూతిని కలిగించడం లో మూవీ టీం మొత్తం సక్సెస్ అయ్యింది. కమర్షియల్ గా ‘భింబిసారా’ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చెప్పలేము కానీ, కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో సక్సెస్ ఫుల్ చిత్రం గా చెప్పుకోవచ్చు.
నటీనటులు : కళ్యాణ్ రామ్ , ఆషిక రంగనాథ్ , బ్రహ్మాజీ, జయప్రకాశ్ , కళ్యాణి నటరాజన్
బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ ఎర్నినేని, రవి శంకర్
డైరెక్టర్ : రాజేందర్ రెడ్డి
మ్యూజిక్ డైరెక్టర్ : గిబ్రాన్
రేటింగ్ : 2.75 /5