Unstoppable with NBK : షో లో అత్యధిక వ్యూస్ వచ్చిన టాప్ 5 ఎపిసోడ్స్ ఇవే!

- Advertisement -

Unstoppable WIth NBK : ఆహా మీడియా లో ప్రసారమయ్యే నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ టాక్ షో, రేపటి తో రెండవ సీజన్ ని కూడా పూర్తి చేసుకోబోతుంది.ఈ రెండవ సీజన్ లో చివరి ఎపిసోడ్ ని గత ఏడాది డిసెంబర్ 27 వ తారీఖున షూట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి మొదటి భాగం ని ఇటీవలే విడుదల చెయ్యగా అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.

Unstoppable With NBK
Unstoppable With NBK

రెండవ భాగం రేపు రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానుంది.ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని ఇటీవలే విడుదల చెయ్యగా , మొదటి ఎపిసోడ్ కంటే ఆసక్తికరంగా ఉండబోతుంది అనే విషయం అర్థం అవుతుంది..ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు ఎంతో మంది సెలెబ్రిటీలు ఈ టాక్ షో లో పాల్గొన్నారు, అయితే అన్నిటిలోకి టాప్ 5 వ్యూస్ ని సాధించిన ఎపిసోడ్స్ ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Prabhas unstoppable

ప్రస్తుతానికి ఈ టాక్ షో అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకొని నెంబర్ 1 స్థానం లో నిల్చింది ప్రభాస్ ఎపిసోడ్..రెండు భాగాలుగా విభజించి టెలికాస్ట్ చేసిన ఈ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది..ఈ ఎపిసోడ్ తర్వాతి స్థానం లో నిల్చింది పవన్ కళ్యాణ్ ఎపిసోడ్.దీనిని కూడా రెండు భాగాలుగా విభజించారు, మొదటి భాగం రీసెంట్ గానే అప్లోడ్ చెయ్యగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది, రెండవ ఎపిసోడ్ నిన్ననే విడుదల అయ్యింది..మొదటి ఎపిసోడ్ మొత్తం సినిమాల మీద ఉండగా, రెండవ ఎపిసోడ్ మొత్తం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రశ్నలు అడిగాడు బాలయ్య.

- Advertisement -
Pawan Klayan Unstoppble Show.,

ఇక మూడవ స్థానం లో కొనసాగుతున్న ఎపిసోడ్ సీజన్ 1 గ్రాండ్ ఫినాలే కి వచ్చిన మహేష్ ఎపిసోడ్ అని తెలుస్తుంది..ఈ ఎపిసోడ్ ద్వారానే ఆహా యాప్ ఇండియా లోనే టాప్ 10 లిస్ట్ లోకి అడుగుపెట్టిందని చెప్తుంటారు.ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ వచ్చే వరకూ కూడా ఈ ఎపిసోడ్ కి అత్యధిక వ్యూస్ వచ్చినట్టు ఆహా మీడియా యాప్ లో కనిపిస్తూ ఉండేది.ఇక నాల్గవ స్థానం లో చంద్ర బాబు నాయుడు ఎపిసోడ్, ఐదవ స్థానం లో బ్రహ్మానందం ఎపిసోడ్ ఉన్నట్టు తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి మొదటి 14 గంటల్లోనే 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ వచ్చాయని ఆహా మీడియా అధికారికంగా ప్రకటించింది.. ప్రభాస్ ఎపిసోడ్ కి మొదటి భాగానికి ఆ రేంజ్ వ్యూస్ రావడానికి 48 గంటలు పట్టింది..ఇక ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ భాగం నిన్ననే విడుదల చేసారు..మొదటి భాగం కంటే రెండవ భాగానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అప్లోడ్ చేసిన నిమిషాల వ్యవధిలోనే టాప్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది..ఈ రెండు ఎపిసోడ్స్ కి కలిపి వచ్చిన వ్యూస్ చూస్తే రెండు సీజన్స్ లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి అత్యధిక వ్యూస్ వచ్చాయని చెప్పొచ్చు.

Mahesh Babu unstoppable show
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here