Kalpika Ganesh : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న మహేశ్ బాబు హీరోయిన్.. బయటపెట్టిన మరో నటి

kalpika ganesh


కల్పిక గణేశ్ Kalpika Ganesh .. ఈ బ్యూటీ టాలీవుడ్ లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, సిస్టర్ గా సహాయ పాత్రల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే రిలీజైన సమంత యశోద మూవీలో తేజుగా అలరించింది. ఈమెకు సినిమాలతోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంకా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉంటుంది. తాజాగా తన కో స్టార్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది కల్పిక. 

Dhanya Balakrishna
Dhanya Balakrishna

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేశ్ బాబుతో నటించిన ధన్య బాలకృష్ణ సినిమా గుర్తుంది కదా. ఆమె గురించి కల్పిక సంచలన వ్యాఖ్యలు చేసింది. ధన్య సీక్రెట్ గా పెళ్లి చేసుకుందంటూ సీక్రెట్ రివీల్ చేసిందని చెప్పింది. ధన్య పెళ్లికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించింది.

Dhanya Balakrishna and Kalpika Ganesh
Dhanya Balakrishna and Kalpika Ganesh

ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రహస్యాల పుట్ట. అందులో కొన్ని మాత్రమే బయటకు వస్తాయి. అలాంటి ఓ సెన్సేషనల్ విషయం ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ నటి ధన్య బాలకృష్ణకు సంబంధించిన ఓ సీక్రెట్ బయటకొచ్చింది. దీన్ని బయటపెట్టింది మరెవరో కాదు మరో నటి కల్పిక గణేశ్. కల్పిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫ్యాన్స్ తో లైవ్ లో మాట్లాడింది. ఈ క్రమంలోనే ధన్య బాలకృష్ణకు సంబంధించి ఓ సీక్రెట్ షేర్ చేసుకుంది. 

Dhanya Balakrishna and Balaji Mohan
Dhanya Balakrishna and Balaji Mohan

“ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ లైఫ్ సాగిస్తున్న ధన్య బాలకృష్ణ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. అది కూడా ఇప్పటికే పెళ్లై విడాకులు తీసుకున్న డైరెక్టర్ బాలాజీ మోహన్ ను. ఈ పెళ్లి జరిగి ఏడాది అవుతోంది. ఎవరికీ ఈ విషయం తెలియదు. ఈ ఏడాది జనవరిలో మారి, మారి-2 సినిమాల దర్శకుడు బాలాజీ మోహన్ ను ధన్య పెళ్లి చేసుకుంది. చెన్నై వెళ్లిన ప్రతిసారి ధన్య బాలాజీతోనే ఉండేది. ఈ పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇద్దరు బయటి ప్రపంచానికి తెలియకుండా కలిసి ఉంటున్నారు.

ఇప్పుడు నేను ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే.. పెళ్లి తర్వాత బాలాజీ ధన్యను టార్చర్ పెడుతున్నాడని అనుకున్నా కానీ వాళ్లు బాగానే ఉన్నారు అనిపించింది.  కానీ ఈ మధ్య ధన్య తన సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు రావడం లేదు. అందుకే నాకు అనుమానంగా ఉంది. తనను కాంటాక్ట్ అవ్వలేక పోతున్నా. బాలాజీ ధన్యను బయటకు రానివ్వడం లేదనుకుంటా. అందుకే ఈ విషయం ఇప్పుడు అందరికీ చెబుతున్నా” అని కల్పిక తన లైవ్ లో అసలు విషయం చెప్పుకొచ్చింది.

Dhanya and Balaji Mohan
Dhanya and Balaji Mohan

ఈ విషయం తెలిసి ధన్య ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ నిజంగా ప్రాబ్లమ్స్ లో ఉందా అని ఆందోళన చెందుతున్నారు. ధన్య బాలకృష్ణ ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సెవెన్త్ సెన్స్, నేను శైలజ, జయజానకి నాయక మూవీస్ లో నటించి మెప్పించింది. ఇవే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.