Kalki 2898 Ad Review : విజువల్ వండర్ క‌ల్కి 2898 ఏడీ.. ప్రభాస్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్

- Advertisement -

Kalki 2898 Ad Review : ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురు చూసిన సినిమాల్లో కల్కి ఒకటి. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కిన సినిమాలో ప్రభాస్ హీరోగా నటించాడు. దాదాపు 40ఏళ్ల తర్వాత క‌మ‌ల్‌హాస‌న్‌, అమితాబ్‌బ‌చ్చన్ ఒకే సినిమాలో కల్పించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా ప‌దుకోణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. మహానటి ఫేం నాగ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై అశ్విని దత్ దాదాపు రూ.600కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా చూద్దాం ?

Kalki Review

కథ :

కురుక్షేత్ర యుద్ధం జ‌రిగిన 6000ఏళ్ల తర్వాత భూమి మొత్తం నాశం అవుతుంది. అధ‌ర్మం పెరిగిపోయి మాన‌వులు ప్రకృతి నాశనం చేస్తుంటారు. దీంతో సుప్రీమ్ యాశ్కిన్ (క‌మ‌ల్‌హాస‌న్‌) కాంప్లెక్స్ పేరుతో కొత్త ప్రపంచాన్ని నెలకొల్పుతాడు. ప్రకృతి వనరులను తను సృష్టించిన కాంప్లెక్స్ కు మాత్రమే పరిమితం చేస్తాడు. కాశీ న‌గ‌రంపైన ఉన్న కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి భూమి మీద మిగిలిన మానవులు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారిలో భైర‌వ (ప్రభాస్) ఒక‌రు. ఎలాగైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనేది అతడి కల.

- Advertisement -

సుప్రీమ్ యాశ్కిన్ అన్యాయాల‌పై రెబెల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. శంబాలా పేరుతో రహస్య ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకుని సుప్రీమ్ యాశ్కిన్ గ్యాంగ్‌కు దొర‌క్కుండా పోరాటం చేస్తుంటారు. దేవుడు మ‌ళ్లీ క‌ల్కి అవ‌తారంలో మ‌హిళ గ‌ర్భం ద్వారా భూమిపై అవ‌త‌రించ‌బోతున్నాడ‌ని శంబాలా ప్రజలు నమ్ముతుంటారు. ఆ దేవుడికి జ‌న్మనిచ్చే మ‌హిళ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. కాంప్లెక్స్ ప్రపంచం నుంచి గ‌ర్భంతో ఉన్న సుమ‌తి (దీపికా ప‌దుకోణె) త‌ప్పించుకుంటుంది.

సుమ‌తిని త‌మ‌కు అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తామని క‌మాండ‌ర్ మాన‌స్‌ భైర‌వ‌తో ఒప్పందం చేసుకుంటాడు. కానీ భైర‌వ‌తో పాటు క‌మాండ‌ర్ మాన‌స్ మ‌నుషుల భారి నుంచి సుమ‌తిని అశ్వత్థామ (అమితాబ్ బ‌చ్చన్) కాపాడుతాడు. సుమ‌తిని శంబాల‌కు సుర‌క్షితంగా తరలిస్తాడు. ఇంతకీ అశ్వత్ధామ ఎవరు సుమ‌తిని మాన‌స్‌కు అప్పగించి కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైరవ కల నెరవేరుతుందా.. భైర‌వ చివ‌ర‌కు అత‌డి బారి నుంచి ఆమెను ఎందుకు కాపాడాడు? వేల ఏళ్లుగా అశ్వత్థామ బ‌తికి ఉండ‌టానికి రహస్యం ఏమిటి? భైర‌వ‌కు మ‌హాభార‌తంతో ఉన్న సంబంధం ఏంటి? అన్నదే కల్కి చిత్ర కథ .

హాలీవుడ్ సినిమాలకు ధీటుగా

కల్కి సినిమాను డైరెక్టర్ నాగ అశ్విన్ మార్వెల్ సిరీస్ సూప‌ర్ హీరోల సినిమాలకు ధీటుగా తెరకెక్కించాడు. సూప‌ర్ హీరో సినిమాలను మ‌న పురాణాల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తే ఎలా ఉంటుంది అన‌డానికి చక్కటి ఉదాహరణ కల్కి సినిమా. ఇతిహాసాల్లోని కొన్ని పాత్రలు, వారికి ఉన్న అతీత శ‌క్తుల‌కు ఓ ఫిక్షనల్ వరల్డ్ ను జోడించి నాగ్ అశ్విన్ ఈ మూవీని నిర్మించారు. ఈ క‌థ‌ను మార్వెల్ సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గని విధంగా లార్గెన్‌దేన్ లైఫ్ విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్‌తో చెప్పాల‌ని నాగ్ అశ్విన్ ట్రై చేశారు.

సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను మైమరపిస్తాయి. సినిమాలో ఉప‌యోగించే గ‌న్స్‌, వెహికిల్స్ తో పాటు క్యారెక్టర్ల లుక్స్ వ‌ర‌కు ప్రతిదీ డిఫ‌రెంట్‌గా ప్రయత్నించారు డైరెక్టర్. ఈ గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్ మాయ‌లో క‌ల్కి క‌థే చిన్నబోయిన ఫీలింగ్ క‌లుగుతుంది. తాను చెప్పాల‌నుకున్న క‌థ‌ను ఒక్క పార్ట్‌లో కంప్లీట్ చేయ‌డం సాధ్యం కాద‌ని ముందే నాగ్ అశ్విన్ ఫిక్స్ అయ్యాడు. అందుకే క‌ల్కి 2898 ఏడీ పార్ట్ 1 సినిమాను కేవ‌లం పాత్రల ప‌రిచ‌యానికే ఉప‌యోగించుకున్నాడు. కంప్లెక్స్‌, శంబాలా వ‌ర‌ల్డ్‌ల‌ ప‌రిచ‌యం, భైర‌వ‌, అశ్వత్థామ‌తో పాటు మిగిలిన పాత్రలు ఎలా ఉంటాయి. వారి నేపథ్యం ఏంటి అనేది ఈ సినిమాలో చూపించాడు. ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్ అనిపించింది.

చాలా మంది సెలబ్రిటీలు

సినిమాలో చాలా మంది సెలబ్రిటీలను మిళితం చేశారు డైరెక్టర్ నాగ అశ్విన్. పాత్రలు ఎక్కువగా ఉండడంతో స్క్రీన్ స్పేస్ ఎవరీకి పెద్దగా దక్కలేదు. ప్రభాస్ పాత్ర సినిమా మొద‌లైన అరగంత త‌ర్వాతే ఎంట్రీ ఇస్తుంది. ఆ త‌ర్వాత యాక్షన్ ఎపిసోడ్స్‌లో మాత్రమే క‌నిపిస్తుంది. మూడు గంట‌ల సినిమాలో ప్రభాస్ కనిపించేది గంట మాత్రమే. ప్రతి ఐదు నిమిషాల‌కు ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది

రాజ‌మౌళి, దుల్కర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఇలా చాలా మంది క్యారెక్టర్లు సినిమాపై బ‌జ్ రావ‌డానికి క్రియేట్ చేసిన‌వే. భైర‌వ‌గా ప్రభాస్ తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. ఆయన పై చిత్రీక‌రించిన యాక్షన్ ఎపిసోడ్స్ గూస్‌బంప్స్‌ను తెప్పించాయి. క‌మ‌ల్‌హాస‌న్ సినిమాలో కేవ‌లం ప‌ది నిమిషాలలోపే క‌నిపిస్తారు. సెకండ్ పార్ట్‌లో ఆయనకు క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇస్తారని డైరెక్టర్ హింట్ ఇచ్చారు. మృణాల్ ఠాకూర్ సినిమా మొదట్లోనే కనిపిస్తుంది.సంతోష్ నారాయ‌ణ‌న్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

ఓవరాల్ గా..

క‌ల్కి 2898 ఏడీ విజువ‌ల్ వండ‌ర్.. హాలీవుడ్ సినిమాల‌ను తలపించే స‌రికొత్త ఎక్స్‌పీరియ‌న్స్‌ను ప్రేక్షకులకు పంచుతుంది.

రేటింగ్ : 3/5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here