Kaikala satyanarayana : అయ్యో పాపం.. కైకాల సత్యనారాయణ మరణానికి కారణం అదేనా?

- Advertisement -

Kaikala satyanarayana :ఈ మధ్య వరుసగా సినీ నటులు మరణిస్తున్నారు.. ఏదొక చిన్న సమస్యతో చనిపోతున్నారు..మొన్నీమద్య సూపర్ స్టార్ కృష్ణ గుండె పోటుతో మరణించారు..ఆయన మరణం తీరని లోటు..ఆ ఘటనను పూర్తిగా మరువక ముందే ఇప్పుడు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వర్గస్తులు అయ్యారు..శుక్రవారం తెల్లవారు జామున ఆయన కన్నుమూశారు. గతంలో చాలా సార్లు ఆయన అనారోగ్యానికి గురైయ్యారు.. అయితే వైద్యుల పర్యవేక్షణలో ఉండి నయం చేసుకున్నారు..కానీ ఇప్పుడు తుదిశ్వాస విడిచారు.

kaikala satyanarayana
Kaikala satyanarayana

గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దే చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపై టాలివుడ్ సినీ లోకం ఎంతో ఆవేదన చెందుతోంది. కైకాల మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని తెలుగు సీనియర్ నటులు చెప్పుకొచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ సహా నటీనటులంతా కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 65 ఏళ్లు సినిమాలలోనే ఉన్న కైకాల దాదాపు 777 సినిమాలు చేశారు.

Actor kaikala satyanarayana
Actor kaikala satyanarayana

హీరోగా, విలన్ గా, కమెడిన్ గా నటించారు కైకాల..విలక్షణ పాత్రలతో సినీ పరిశ్రమకు పేరు తెచ్చిన నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు కాగా, ఆయన పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు .తనదైన విలక్షణ నటనతో అన్ని వర్గాల ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకున్న కైకాల ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు.. 1960 ఏప్రిల్‌ 10న నాగేశ్వరమ్మని వివాహం చేసుకోగా, ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. నటుడు కావాలని కలలు కంటూ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదగుతూ వచ్చారు. హీరోగా, విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా మెప్పించారు..ఎన్నో అవార్దులను కూడా అందుకున్నారు..

- Advertisement -
Kaikala satyanarayana

ఐదు తరాల హీరోలతో సినిమాలు చేసిన ఘనత ఆయనకే దక్కింది… కొంత కాలంగా కైకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ సారి కరోనా బారిన కూడా పడ్డారు. గత ఏడాది ఇదే సమయానికి ఆయన కన్నుమూసాడంటూ ప్రచారాలు కూడా చేశారు అయితే దాదాపు ఆరు నెలల నుండి ఇంట్లోనే శస్త్ర చికిత్స చేయించుకుంటున్నా కైకాల నిన్న తెల్లవారుఝామున కన్నుమూసారు. వయోభారంతో పాటు ఈ కాలంలో కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లమ్ తలెత్తడం వల్లనే కైకాల కన్నుమూసినట్టు వైద్యులు చెబుతున్నారు. చివరిగా కైకాల మహర్షి సినిమాలో పూజా హెగ్డేకి తాతయ్యగా కనిపించారు..ఏది ఏమైనా ఈయన లాంటి నటుడు మళ్ళీ పుట్టరు.. సినిమా ఇండస్ట్రీ మంచి నటుడును పోగొట్టుకుంది..ఆయన మరణాన్ని చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here