Junior NTR ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి కొద్దీ రోజుల్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకొని మాస్ మరియు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న యువ హీరో విశ్వక్ సేన్.’ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమైనా ఈ హీరో తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత రెండవ సినిమా ‘ఫలక్ నూమా దాస్’ తో హీరో గా మాత్రమే కాదు, డైరెక్టర్ గా కూడా రాణించి సక్సెస్ అయ్యాడు.అలా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న విశ్వక్ సేన్, ఇప్పుడు ‘ధమ్కీ’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.ఈ నెల 22 వ తారీఖున తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో రాబోతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరో గా నటిస్తూనే దర్శకుడిగా మరియు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

విశ్వక్ సేన్ తాను ఇప్పటి వరకు సంపాదించిన డబ్బులు మొత్తం ఈ సినిమా మీదనే పెట్టేసాడు.కాబట్టి ఈ చిత్రం జనాల్లో బాగా రీచ్ అవ్వడానికి నిన్న శిల్ప కళా వేదిక లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి జూనియర్ ఎన్టీఆర్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు.విశ్వక్ సేన్ ఎంతో ప్రేమతో పిలిచేసరికి ఎన్టీఆర్ వెంటనే ఒప్పుకొని హాజరయ్యాడు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది,ఆయన మాట్లాడుతూ ‘నేను ఎప్పుడైనా మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు కేవలం కొన్ని సినిమాలను మాత్రమే చూస్తాము.వాటిల్లో ఒకటి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే సినిమా,ఇందులో విశ్వక్ సేన్ కామెడీ చెయ్యకుండానే నవ్వు రప్పిస్తాడు.అది చాలా కష్టమైంది, ఆ తర్వాత వస్తున్నా సినిమాలన్నీ కూడా చూసాను కానీ, ఎందుకో విశ్వక్ సేన్ ఒకే మూస లో వెళ్తున్నాడు అని నాకు అనిపించింది’.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘తొందరగా ఆ మూస నుండి బయటపడి డిఫరెంట్ సినిమాలు చెయ్యాలి అని అనుకున్నాను.అప్పుడు వచ్చింది ‘ఆకాశం లో అర్జున కళ్యాణం ‘ చిత్రం.అంత మాస్ గా ఉండే విశ్వక్ సేన్ ఒక్కసారిగా ఇంత కూల్ గా సుబ్తుల్ పాత్రలో కనిపించేసరికి షాక్ అయ్యాను.ఇంత ఫాస్ట్ గా మారిపోయాడేంటి అని అనుకున్నాను.ఎందుకంటే నేను కూడా ఇలా ఒకే మూస లో వెళ్తున్న సమయం లో బయటపడడానికి చాలా సంవత్సరాలు పట్టింది.కానీ విశ్వక్ సేన్ కి చాలా తక్కువ సమయం పట్టింది.ఇది మామూలు విషయం కాదు.ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం కూడా వహించాడు,పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా తర్వాత ఆయన దర్శకత్వం ఆపేయాలి.అప్పుడే కొత్త వాళ్లకి ఛాన్స్ దక్కుతుంది, ఇండస్ట్రీ కి ఎంతో మేలు జరుగుతుంది’ అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా మాట్లాడాడు.