Rashmika Mandanna : అయ్యో పాపం.. చివరికి అలాంటి పని చెయ్యడానికి రెడీ అవుతున్న రష్మిక.. నిజామా?

- Advertisement -

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి అందరికి తెలుసు.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. ఎంతగా ఫెమస్ అవుతుందో అంతగా వివాదాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది.. గత ఏడాది కాంతారా సినిమా వివాదం కారణంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే. ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. సొంత గడ్డ అయిన కన్నడలోనే రష్మికపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎంతలా అంటే ఆమెను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసేంత. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్లు కూడా బాగా తగ్గాయి. ప్రస్తుతం రష్మిక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జోడీగా పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.

Rashmika Mandanna
Rashmika Mandanna

ఇటీవల బాలివుడ్ లో పాగా వేసిన ఈ అమ్మడు అక్కడ కూడా హిట్ టాక్ ను అందుకున్నా కూడా కొత్త సినిమాలకు సైన్ చెయ్యలేదు.. దాంతో ఇప్పుడు ఖాళీగా ఉన్న ఈ అమ్మడు బుల్లితెరపై సందడి చెయ్యనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. దాంతో ఆమె ఫ్యాన్స్ అయ్యో పాపం.. చివరికి అలాంటి పని చెయ్యడానికి రెడీ అవుతుందా అని కామెంట్స్ చేస్తున్నారు.. ఇందులో భాగంగానే రష్మిక త్వరలోనే ఓ మరాఠీ టీవీషో ద్వారా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నది. ఈ షో మార్చి 26న ప్రసారం కానుంది. ఈ షోలో రష్మిక మరాఠీకి చెందిన లవణీ అనే సంప్రదాయ జానపద నృత్యాన్ని పర్‌ఫార్మ్‌ చేసింది.

rashmika-mandanna

ఈ సందర్భంగా టీవీ షో నిర్వాహకులు సంప్రదాయ మరాఠీ దస్తుల్లో రష్మిక మందన్న డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోను బయటకు వదిలారు. మా షోలో రష్మిక మందన్నా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అచ్చమైన మరాఠీ అమ్మాయి వస్త్రధారణలో రష్మిక మహారాష్ట్రీయుల హృదయాల్ని గెలుచుకుంది అంటూ సదరు షో నిర్వాహకులు నేషనల్ క్రష్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. మొత్తానికి సినిమా ఆఫర్ల అంతంత మాత్రంగా మారడంతో.. రష్మిక చివరకు బుల్లితెరపై తన క్రేజ్ ను పెంచుకోవడానికి రెడీ అవుతుందన్నమాట.. అక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here