Jhanavi kappor:వామ్మో.. జాన్వీ కపూర్ నెలకు ఇంత సంపాదిస్తోందా..?

- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్. వరుస సినిమాలతో బాలీవుడ్​లో దూసుకెళ్తోంది. హిట్.. ప్లాఫ్​లతో సంబంధం లేకుండా ఈ బ్యూటీకి ఆఫర్లు తలుపు తడుతున్నాయి. వచ్చే అవకాశాలన్నింటిని సద్వినియోగం చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది ఈ భామ.

jhanavi kapoor

ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది జాన్వీ. కైపెక్కించే పోజులు.. మత్తెక్కించే చూపులు.. రెచ్చగొట్టే హావభావాలతో పిచ్చెక్కిస్తోంది. ఈ బ్యూటీ ఫొటోలు చూసిన కుర్రాళ్ల గుండె ఝల్లుమంటోంది.

jhanavi kapoor

సోషల్ మీడియాలో జాన్వీ గ్లామర్ షో మామూలుగా ఉండదు. ఎక్స్​పోజింగ్​లో హద్దులు చెరిపేస్తూ బ్యూటీ ట్రీట్ ఇస్తోంది ఈ భామ. ఇలా సోషల్ మీడియాలో తాను ఈ రేంజ్‌లో అందాలు ఆరబోయడం వెనుక కారణం ఉందని చెప్పింది జాన్వీ. తాను సోషల్ మీడియాను అంత సీరియస్‌గా తీసుకోలేదని.. అయితే అక్కడ కాస్త బోల్డ్‌గా ఉంటే తనకు మరికొన్ని బ్రాండ్స్ వస్తాయని చెప్పింది. తన ఫొటోలు బాగుంటే ఇంకో 5 మంది తన ఫొటోలను లైక్ చేస్తారని, దీంతో తనకు ఉన్న ఈఎంఐలు కట్టడం కాస్త సులువవుతుందని నిర్మొహమాటంగా చెప్పేసింది జాన్వీ.

- Advertisement -
jhanavi kapoor

మరోవైపు జాన్వీ ఆదాయం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2022 సంవత్సరం వరకు ఆమె సంపద విలువ $10 మిలియన్‌ వరకు ఉంటుందని తెలుస్తోంది. అంటే భారతీయ రూపాయలలో నికర విలువ రూ. 82 కోట్లు అన్నమాట. ఇక జాన్వీ నెలవారి ఆదాయం 0.5 కోట్లుగా వార్షిక ఆదాయం రూ.6 నుంచి రూ.8 కోట్లకు ఉంటుందని అంటున్నారు.

jhanavi kapoor

ఈ భామ నటించిన ‘మిలీ’ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది. మిలీ మలయాళీ హెలెన్ సినిమాకు రీమేక్‌. ఈ సినిమాకు మతుకుట్టి క్జావియర్ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్ నిర్మాత. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలుగులో ఈ భామ ఎలా రాణిస్తుందో..?

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here