Ram Charan : నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో నిన్నటి నుంచి అంతా రామ్ చరణ్ హవా, గేమ్ ఛేంజర్ హవా సాగుతుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా దిల్ రాజు నిర్మాణంలో భారీగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. నిన్న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ‘జరగండి జరగండి..’ అంటూ సాగే మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు.
ఈ పాటని అనంత్ శ్రీరామ్ రాయగా థమన్ సంగీత దర్శకత్వంలో డాలర్ మెహెన్ది, సునిధి చౌహన్ పాట పాడారు. ప్రభుదేవా ఈ పాటకు కొరియోగ్రఫీ చేసారు. అయితే ఈ సాంగ్ బీట్ పరంగా వినడానికి ఊపొచ్చే పాటలా ఉన్నా లిరిక్స్ అర్ధం కావట్లేదు, జనాలకి పాట కూడా అంతగా కనెక్ట్ అవ్వట్లేదు. గతంలో ఈ పాట లీక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పాట పై పలువురు విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి జరగండి జరగండి సాంగ్ మాత్రం వైరల్ గా మారి ట్రెండ్ అవుతుంది.
అయితే ఈ పాటలో రామ్ చరణ్ వేసిన ఓ డ్రెస్సు ఇప్పుడు వైరల్ అవుతుంది. పాటలో వేసిన ఓ డ్రెస్సు మీద హీరోయిన్ కియారా అద్వానీ ఫోటోలు ప్రింట్ చేశారు. షర్ట్, ప్యాంట్ మీద కియారా ఫొటోలు ప్రింట్ చేసి ఉన్నాయి. దీంతో ఈ డ్రెస్ వేసుకున్న స్టిల్స్ వైరల్ గా మారాయి. ఈ డ్రెస్ పై కామెంట్స్ చేస్తూ.. ఇదేమి క్రియేటివిటీ అంటూ పలువురు విమర్శలు చేస్తుంటే, పలువురు మాత్రం కొత్తగా ఉంది అంటూ పొగుడుతున్నారు. అయితే ఇలా హీరోయిన్ ఫోటోలని డ్రెస్ మీద ప్రింట్ చేయడంతో సోషల్ మీడియాలో శంకర్ ని సరదాగా ట్రోల్స్ చేస్తున్నారు.
View this post on Instagram