Janhvi Kapoor : పొట్టి బట్టలేసుకుని పబ్లిక్ గా అందాలను ఆరబోస్తున్న అతిలోక సుందరి కూతురు.. చూసిన వాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు

- Advertisement -


Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ పేరు ఇటీవల టాలీవుడ్ లో మార్మోగిపోతుంది. ఈ అమ్మడు బాలీవుడ్ లోకి 2018లో ‘ధడక్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. తర్వాత చాలా సినిమాల్లో నటించిన ఆశించిన స్థాయిలో అక్కడ సక్సెస్ అందుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో ఆమె ఛాలెంజింగ్ పాత్రలు చేసినా అవి ఆశించినంత విజయం సాధించలేదు. ఇటు ప్రేక్షకులను అటు విమర్శకులను ఎందుకో ఆకట్టుకోలేకపోయాయి.

Janhvi Kapoor
Janhvi Kapoor

జాన్వీ కపూర్‌కి హిట్‌లు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం స్టార్ స్టేటస్ అందుకుని కోట్లది మంది ఫ్లాలోవర్స్ ను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు దాదాపు 22 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అక్కడ ఆమె నిరంతరం హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. వివిధ బ్రాండ్‌లను ఎండార్స్ చేయడం ద్వారా కూడా చాలా డబ్బు సంపాదిస్తుంది జాన్వీ. ఇటీవల, ఆమె నైకాని ప్రమోట్ చేయడానికి #Nykaaland ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరైంది. అక్కడ ఆమె తన వంపులు, టైట్ అందాలను ప్రదర్శించే గ్రీన్ కలర్ డ్రెస్ లో అద్భుతంగా మెరిసిపోయింది. ఆమె ఓపెన్ హెయిర్, పర్ఫెక్ట్ మేకప్‌తో చూడడానికి ఓ ఏంజెల్ లాగా కనిపించింది.

Janhvi Kapoor Photos

జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘మిస్టర్ & మిసెస్ మహి’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న టాలీవుడ్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి స్టార్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు సిరిల్, ఎడిటర్‌గా శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవించందర్ పని చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అయితే జాన్వీకి తెలుగులో హీరోయిన్ అవకాశాలు క్యూ కట్టడం ఖాయం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here