Sekhar Master : జనాలను మోసం చేస్తున్న టాప్ కొరియోగ్రాఫర్ కూతురు.. అసలు నిజం చెప్పిన శేఖర్ మాస్టర్

- Advertisement -

Sekhar Master : టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్ హీరోలకు ఐకానిక్ మూమెంట్స్ కంపోజ్ చేస్తూ, పలు టెలివిజన్ షోలలో కొత్త డ్యాన్సర్లను ప్రోత్సహిస్తూ ఓ హీరో రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. ఆయన వారసులైన కూతురు సాహితి, కొడుకు విన్నీలు టాలీవుడ్ ఆడియనులకు సుపరిచితులే. ఈ ఇద్దరు పిల్లలు ఇప్పటికే పలు టీవీ షోలలో సందడి చేశారు. ‘లవ్ స్టోరీ’ సినిమాలో సాయి పల్లవి డాన్స్ చేసిన ‘సారంగ దరియా’ పాటకి శేఖర్ కూతురు సాహితి డ్యాన్స్ చేసి అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

Sekhar Master
Sekhar Master

దీంతో సాహితికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఆ తరువాత నుంచి సోషల్ మీడియాలో సాహితి పోస్టు చేసిన ప్రతి డ్యాన్స్ వీడియోలు బాగా వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే సాహితికి ఉన్న ఫేమ్ ని ఉపయోగించుకుని.. కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్ మాస్టర్ ఇన్ స్టాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. నా కూతురు పేరు మీద ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి.. పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. వారిని నమ్మకండి అంటూ చెప్పుకొచ్చాడు.

Sekhar Master  Daughter

మీ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తానంటూ సాహితి చేసినట్లు మెసేజ్ లు చేస్తున్నారట. అది నమ్మి కొందరు డబ్బులను పంపి మోసపోతున్నారట. వారు ఈ విషయాలను శేఖర్ మాస్టర్ దృష్టికి తీసుకు పోవడంతో మోసం బయట పడింది. దీనికి రెస్పాండ్ అవుతూ శేఖర్ మాస్టర్ వీడియో విడుదల చేశారు. తన కూతురు అకౌంట్‌ని, ఫేక్ అకౌంట్స్‌ని ఆ వీడియోలో చూపించాడు. తన కూతురు అకౌంట్ లో శేఖర్ మాస్టర్ ఫాలోవర్ గా ఉంటాడని అది గమనించాలని కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here