Janhvi Kapoor రేటు చూసి షాక్ అవుతున్న ఇండస్ట్రీ.. ఒక్క సినిమకే పరిమితం

- Advertisement -

Janhvi Kapoor : ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన నటి శ్రీదేవి. ఇక్కడి నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కూడా ఓ వెలుగు వెలిగింది. అయితే మొత్తానికి ఆమె కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టబోతోంది. ఎన్టీఆర్30 మూవీలో తారక్ సరసన జాన్వీ నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ లు అందుకునే ఈ భామలు టాలీవుడ్ లోనూ అదే స్థాయిలో డిమాండ్ చేయడం సహజం. అందుకు తగినట్లే ఈ ఎన్టీఆర్30 కోసం జాన్వీ కూడా భారీ మొత్తం అందుకుంటుందని టాక్.

Janhvi Kapoor
Janhvi Kapoor

ఎన్టీఆర్ సినిమా కోసం జాన్వీ కపూర్ 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటోందనేది అప్పటి టాక్. కానీ ఇప్పుడు కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా 5 కోట్ల రూపాయలు తీసుకుంటోందట. ఈ మేరకు యూనిట్ నుంచే లీకులు వస్తున్నాయి. గతంలో సాహో సినిమా కోసం శ్రద్ధాకపూర్ 5 కోట్లు తీసుకుందట. దాదాపు అంతే మొత్తాన్ని కియరా అద్వానీ కూడా టాలీవుడ్ లో ఛార్జ్ చేసిందట. వాళ్ల కంటే తగ్గితే బాగుండదు కాబట్టి జాన్వీ కూడా 5 కోట్లు తీసుకుందనేది అంటున్నారు.ఇలా అయితే టాలీవుడ్లో ఒక్క సినిమాతోనే వెనుతిరగడం ఖాయమని కూడా టాక్ వినిపిస్తుంది.

Janhvi Kapoor Photos

ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది జాన్వీ. శ్రీదేవి కూతురుగా ఆమెకు టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను జాన్వీ ఇలా క్యాష్ చేసుకుంటోందన్నమాట. అటు బాలీవుడ్ లో ఆమెకు పాపులారిటీ అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకు సాలిడ్ హిట్ లేదు. పెద్ద హీరోలు ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ లో సక్సెస్ అయితే ఇక్కడే సెటిల్ అయిపోతుందేమో జాన్వీ. అక్కడైతే ఇంకా రేటు పెంచేయచ్చనే ఆలోచనలు ఉందిట.

- Advertisement -
NTR Janhvi Kapoor

ఇక హైవోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రానున్న ‘ఎన్టీఆర్‌30’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సెట్స్‌లో బాలీవుడ్‌ స్టార్‌హీరో సైఫ్‌ అలీఖాన్ ‌(Saif Ali Khan) కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఎప్పుడెప్పుడు తారక్‌తో కలిసి నటిస్తానా అని ఎదురుచూసిన జాన్వీ కూడా ఈ షూటింగ్‌లో జాయినైంది. ఎన్టీఆర్‌ మాస్‌లుక్‌ పోస్టర్‌, జాన్వీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్లతో ఈ చిత్రంపై అంచనాలు పెంచేశారు. ఇక ఈ మూవీకి అనిరుధ్‌ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here