Waltari Veerayya : జంబలకిడి జారు మిఠాయా కొద్ది నెలల క్రితం ఈ పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ పాటపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఆ సమయంలో సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పాట ఇది. ఇదే పాటను మంచు విష్ణు నటించిన జిన్నా మూవీలో స్పెషల్ సాంగ్ కూడా వాడారు. ఈ సాంగ్ కు సోషల్ మీడియాలో వస్తున్న క్రేజ్.. ట్రోల్స్ చూసిన డైరెక్టర్ బాబీ.. మెగాస్టార్ చిరంజీవితో తాను తీసిన మూవీ వాల్తేరు వీరయ్యలో ఒక బిట్ పెట్టారు.
ఆల్రెడీ ఈ పాట సోషల్ మీడియాను హోరెత్తించింది. ఇక ఈ పాటను చిరంజీవి కూడా అందుకోవడంతో వాల్తేరు వీరయ్య సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఆ మూవీలో ఈ పాట వచ్చే సీన్ కు థియేటర్లో ప్రేక్షకులు లేచి మరీ విజిల్స్ వేశారు. నేను లుంగీ కడతా సూడు.. నే లుంగీ కట్టా సూడు. నా లుంగీ సైడు సూడకపోతే ఇప్పేస్తాను సూడు.. జంబలకిడి జారు మిఠాయా అంటూ తనదైన మాస్ కామెడీ స్టైల్లో పాడారు చిరు. ఇక ఈ సన్నివేశం వస్తున్నప్పుడు థియేటర్లలో అరుపులు, కేకలతో రచ్చ చేశారు ఫ్యాన్స్.
అయితే సినినా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ చిత్రానికి కేవలం ఇండియాలో కాదు.. యూఎస్ లో కూడా సూపర్ క్రేజ్ వస్తోంది. అమెరికాలో ఉన్న చిరంజీవి ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్రబృందం మెగాస్టార్ చిరంజీవితో కలిసి యూఎస్ ఫ్యాన్స్ పార్టీని ఏర్పాటు చేసింది.
ఈ పార్టీలో నార్త్ అమెరికాకు సంబంధించి 20కి పైగా రాష్ట్రాల చిరంజీవి అభిమానులు వర్చువల్ గా పాల్గొననున్నారు. వారితో చిరంజీవి వర్చువల్ గా మాట్లాడి సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ప్రోమోలో చిరంజీవి తన యూఎస్ ఫ్యాన్స్ తో మాట్లాడారు. అలాగే నేను షర్ట్ ఏస్తా చూడూ.. నేను షర్ట్ ఏస్తా చూడూ.. నువ్వు సూడకుంటే నేను ఇప్పేస్తా సూడు జంబలికిడి జారు మిఠాయా అంటూ యూఎస్ ఫ్యాన్ తో కలిసి పాట పాడారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.
వాల్తేరు వీరయ్య విడుదలై రెండు వారాలవుతున్నా ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు సాధించింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు సంక్రాంతి బరిలో వీరసింహా రెడ్డిగా దిగిన బాలయ్యను చిరు వసూళ్లలో దాటేసి పై చేయి సాధించారు.
“వాల్తేరు వీరయ్య సినిమా గురించి మాట్లాడుతూ.. నా అభిమానులు ఏం కోరుకుంటారో దానిని ఇవ్వడానికి నేను తపన పడుతుంటాను. వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలు చేయడాన్ని ఇష్టపడతాను. ఈ సినిమాలో పాత చిరంజీవిని మళ్లీ చూశారు. ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మెగుడు’, ‘ముఠా మేస్త్రీ’ల్లో చిరంజీవి ఎలా ఉన్నాడో ‘వాల్తేరు వీరయ్య’లో కూడా అలానే ఉన్నాడు. ఈ సినిమా అందరినీ అలరిస్తోంది.” అని చిరంజీవి అన్నారు.