Ariyana Glory : శాకుంతలం ఔట్ ఫిట్ లో బర్త్ డే గర్ల్ అరియానా గ్లామర్ ట్రీట్

- Advertisement -

Ariyana Glory .. ఈ భామ యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని క్రేజ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోయింది. వరుసగా టీవీ షోస్ ఆఫర్లు వచ్చాయి. ప్రజెంట్ చేతి నిండా షోలతో ఈ భామ బిజీబిజీగా గడుపుతోంది.

Ariyana Glory Photos

ఇవాళ అరియానా బర్త్ డే. తన పుట్టిన రోజున అరియానా సోషల్ మీడియాలో కొత్త ఫొటోస్ పోస్టు చేసింది. అలాగే ఓ సూపర్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నన్ను నేను ఎంతగా ప్రేమిస్తానో నా ఫ్యాషన్ సెన్స్ తెలియజేస్తుందని ఆ ఫొటోలకు అరియనా క్యాప్షన్ పెట్టింది. అలాగే ఈరోజు తన బర్త్ డే అని కూడా చెప్పింది. ఈ పోస్టు చూసిన ఫ్యాన్స్ అరియానా బర్త్ డే అని తెలుసుకుని ఆమెకు విషెస్ చెబుతున్నారు.

Ariyana Glory Latest photos

అరియానా ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ప్రేమనంతా కుమ్మరిస్తున్నారు. ఈ బ్యూటీ కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బర్త్ డే గర్ల్ చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల బీబీ జోడి పేరుతో స్టార్ మాలో డాన్స్ రియాలిటీ షో స్టార్ట్  అయ్యింది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో అరియానా అవినాష్ తో కలిసి పార్టిసిపేట్ చేస్తోంది. 

- Advertisement -
Ariyana Glory

అరియనాకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.  ఈ బ్యూటీ ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్త్వం ఆమెను ఇష్టపడేలా చేశాయి. ఈ సీజన్ కు అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం కూడా జరిగింది.

Ariyana Glory pics

అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మదే. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ అరియానాకు ఫుల్ పాపులారిటీ తీసుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ  నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ వైరల్ కావడంతో అరియానా సోషల్ మీడియాలో పాపులర్ అయింది.

Ariyana Glory Photoshoot photos

ఇక సోషల్ మీడియాలో అరియానా జోరు మామూలుగా ఉండదు. ఈ బ్యూటీ తన బోల్డ్ ఔట్ ఫిట్స్ తో బోల్డ్ పోజులతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ బ్యూటీ అందానికి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. ఇక రీసెంట్ గా తన బర్త్ డే ఫొటోలు చూసి మెస్మరైజ్ అవుతున్నారు. శాకుంతలం ఔట్ ఫిట్ లో అరియానా బర్త్ గ్లామర్ ట్రీట్ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here