జబర్దస్త్ కెవ్వు కార్తీక్ పెళ్లి ఫిక్స్ అమ్మాయి ఎవరంటే..

- Advertisement -

మిమిక్రీ ఆర్టిస్ట్​గా హైదరాబాద్​లో అడుగుపెట్టి.. జబర్దస్త్​లో(Jabardasth) వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్​. సాధారణ కంటెస్టెంట్​ నుంచి టీమ్​ లీడర్​గా ఎదిగి.. కెరీర్​లో విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. కంటెస్టెంట్​​గా, టీమ్​ లీడర్​గా తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు.అయితే ఇప్పుడు కార్తీక్ కు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది.

జబర్దస్త్‌ ద్వారా పాపులరైన కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. మన జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తే లైఫ్‌ మరింత హ్యాపీగా మారుతుందని కొందరు చెప్పారని…బహుశా అది ఇదేనేమో అంటూ రాసుకొచ్చాడు. నా జీవితంలోకి అడుగుపెడుతున్నందుకు థ్యాంక్యూ అని.. నీతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు.

తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశాడు కార్తీక్. అయితే ఆ అమ్మాయి ఎవరు అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంచాడు. ఫోటోలో ఆ అమ్మాయి ముఖాన్ని కనిపించనివ్వలేదు. కానీ చూస్తుంటే మాత్రం ఎవరో నటి లానే ఉంది. 2013లో జబర్దస్త్​ ప్రారంభమైన తర్వాత.. తాను 2015 మొదట్లో ఒక సాధారణ కంటెస్ట్​గా అడుగుపెట్టాడు. మొదట ధన్​రాజ్​ టీమ్​లో చేశాడు. ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్​ టీమ్​లో ఆరో కంటెస్ట్​గా కనిపించాడు. 2016లో ముక్కు అవినాశ్​తో టీమ్​ లీడర్​గా అవకాశం వచ్చిన తర్వాతే.. తన కేరీర్​లో చాలా మార్పులు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్​ లీడర్​గా కొనసాగుతున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here