BB Jodi : ముక్కు అవినాష్ కాళ్ళు పట్టుకున్న సదా.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

- Advertisement -

BB Jodi : ఈ మధ్య సినిమాలకన్నా, రియాలిటీ షోలకన్నా కూడా బుల్లితెరపై డ్యాన్స్ షోలు, కామెడీ షోలు ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. ఇక అందులో టీఆర్పీ కోసం వేసే స్టంట్లు జనాలను నవ్విస్తుంటాయి..అవి ఒట్టి డూప్ అని తెలిసినా కూడా మళ్లీ మళ్లీ అవే స్ట్రాటజీలను వాడుతూ ఉంటారు. అయితే తాజాగా బీబీ జోడి షో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. మొదటి సారిగా డ్యాన్స్ షోలో ఢీ షోని ఢీ కొట్టి బీబీ జోడి టాప్‌లో నిల్చింది.బీబీ జోడికి మంచి టీఆర్పీ రేటింగ్‌లు వస్తున్నాయట.. అందుకే ఇంకా మరింత మోతాదును పెంచేశారు. ఇప్పుడు వదిలిన ప్రోమోలో మోహబూబ్, సత్య రెచ్చిపోయారు. ముద్దులతో నానా హంగామా చేశారు. అందుకు సంబందించిన ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది..

BB Jodi
BB Jodi

ప్రస్తుతం ఈ బీబీ జోడిలో కంటెస్టెంట్లు హద్దులు దాటుతున్నారు.ఇక అవినాష్‌ చేసిన ఒక పర్ఫామెన్స్‌కు అంతా ఫిదా అయ్యారు. సదా అయితే స్టేజ్ మీద నుంచి కిందకు వచ్చింది. అవినాష్‌ కాళ్లను మొక్కేందుకు కిందకు వంగింది. కానీ అవినాష్‌ మాత్రం వద్దని వారించాడు. కన్నీళ్లు కూడా పెట్టుకుంది సదా..ఆ తరువాత అవినాష్‌కు సదా హగ్ ఇచ్చింది. అవినాష్‌ చేసిన పర్ఫామెన్స్‌కు ఫిదా అయినట్టుగా సదా చెప్పింది.. హిజ్రాలు సమాజంలో ఎదుర్కొంటోన్న సవాళ్లు, అవమానాలను అవినాష్ తన పర్ఫామెన్స్‌తో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. వారి బాధను అంత గొప్పగా చూపించిన అవినాష్‌ పర్ఫామెన్స్ పట్ల సదా ఆకర్షితురాలు అయ్యింది.

ఇక ఇంత వరకు ఎవ్వరూ కూడా ఇంత గొప్పగా వారి బాధలను చూపించలేదు అని చెప్పుకొచ్చింది. ఇక రాధ అయితే తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పింది. ఒక పెళ్లిలో తనకు ఎదురైన ఘటన గురించి వివరించింది. మగవాళ్లలోని శక్తి, ఆడవాళ్ల హృదయం కలగలిపి వారికే ఉంటుందని హిజ్రాల గురించి గొప్పగా చెప్పింది. ఇప్పుడు ఈ ప్రోమో అయితే అందరినీ కదిలించేస్తోంది. అవినాష్ ఎమోషనల్ పర్ఫామెన్స్, మెహబూబ్ రొమాంటిక్ డ్యాన్స్ ప్రోమో వైరల్ అవుతోంది.. నిజంగా అవినాష్ పెద్ద సాహసమే చేసాడు.. ఆ ప్రోమో పై మీరు ఓ లుక్ వేసుకోండి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here