Jai Hanuman : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సునామీ సృష్టించే కలెక్షన్లు కురిపించింది. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా థియేటర్ లో ఆడుతోందంటే అర్థం చేసుకోవచ్చు దీనికున్న క్రేజ్ ఎంటో.. తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ వీఎఫ్ఎక్స్ తో.. తెలుగు సూపర్ హీరో అనే కొత్త కాన్సెప్టుతో.. పురాణాలను వక్రీకరించకుండా.. అందులోని సారాన్ని అర్థం చేసుకుని.. నేటి తరానికి పరిచయం చేశాడు ప్రశాంత్ వర్మ. అలా హను-మాన్ మూవీతో మొదలు పెట్టిన ఈ జైత్రయాత్ర జైహనుమాన్ వరకు వచ్చింది ఇప్పుడు. ఇలాగే పురాణాలకు సంబంధించి 12 పవర్ ఫుల్ క్యారెక్టర్లను సూపర్ హీరోలుగా పరిచయం చేస్తూ.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తానని ఈ డైరెక్టర్ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ విషయాన్ని ఈ కుర్ర డైరెక్టర్ అధికారికంగా ప్రకటించాడు. హను-మాన్ మూవీ వంద రోజుల ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ తన నెక్స్ట్ మూవీ గురించి కొన్ని విషయాలు షేర్ చేశాడు. అయితే ఇంకొన్నింటి గురించి డైరెక్ట్ గా చెప్పలేదు .. కానీ ఆయన మాటల్లోని ఆంతర్యాన్ని నెటిజన్లు పసిగట్టేశారు. ఈ ఈవెంట్ ప్రశాంత్ వర్మ .. “ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) గురించి స్పందించాడు. కొందరు పీవీయూసీ అని కనిపిస్తే నాకు స్క్రీన్ షాట్ తీసి పంపుతున్నారు. ఆ యూనివర్స్‌లో భాగంగా హనుమాన్ మాత్రమే తీశాను. ఒక్క సినిమాకే ఇంత ప్రేమను చూపిస్తున్నారు.. సినిమాటిక్ యూనివర్స్‌లో 20 ఏళ్లు పని చేయబోతోన్నాను. ఈ యూనివర్స్‌లో హను-మాన్ మూవీలో ఉన్న పాత్రలన్నీ ఉంటాయ్.. సముద్రఖని విభీషణుడిగా కనిపిస్తారు.. తేజ హను మ్యాన్‌గా కనిపిస్తాడు. సత్య.. అతని బర్డ్ కూడా ఉంటుంది.” అని అసలు సంగతి చెప్పుకొచ్చాడు.
అయితే అంతే కాకుండా తన పీవీయూసీలో నటీనటులు గురించి కూడా హింట్ ఇచ్చాడు ఈ కుర్ర దర్శకుడు. “ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఒకే సారి జరుగుతున్నాయి.. యూనివర్స్‌లో కొత్త ఆర్టిస్టులు కూడా కనిపిస్తారు.. చాలా పెద్ద స్టార్లు కూడా నటించబోతోన్నారు.. బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి కూడా వస్తారు.. మీరు వినే రూమర్లు అన్నీ నిజమే. జై హనుమాన్‌ను భారీ స్థాయిలో నిర్మించబోతోన్నాం. గ్రేట్ ఎమోషన్, కంటెంట్, వీఎఫ్ఎక్స్ ఉండబోతోన్నాయి.” అని చెప్పాడు.
అయితే జై హనుమాన్ విషయంలో వినే రూమర్లన్నీ నిజమే అని ప్రశాంత్ వర్మ హింట్ ఇచ్చాడా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అంటే ఇన్నాళ్లు మనం విన్న.. హనుమాన్‌గా చిరంజీవి నటించబోతున్నారని, శ్రీరాముడిగా మహేశ్ బాబు నటిస్తున్నారని.. అంటే.. అంటే ఈ పుకార్లన్నీ నిజమేనని ఇప్పుడు నెటిజన్లు ఈ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే.. ప్రశాంత్ వర్మ మరో అప్డేట్ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే.