Naga Chaitanya : ఆ హీరోయిన్ తో నాగచైతన్య వెకేషన్ పిక్స్ వైరల్.. ఈసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు!

- Advertisement -

Naga Chaitanya : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన సమంతతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే అయితే విడాకుల తర్వాత కొద్దిరోజులేక ఈ యంగ్ హీరో మరో ముద్దుగుమ్మతో ప్రేమలో పడినట్లు రూమర్స్ మొదలయ్యాయి. ఆ భామ కూడా హీరోయిన్ కావడం.. అది కూడా తెలుగమ్మాయి కావడం విశేషం. నాగచైతన్య తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళతో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో వచ్చిన ఈ పుకార్లు ఆ తర్వాత కొన్నిరోజులకు మరుగున పడ్డాయి. ఇటీవల మళ్లీ ఈ భామ చై పోస్టుకు లైక్ కొట్టడంతో మళ్లీ షురూ అయ్యాయి. ఇక తాజాగా మరో పోస్టుతో ఈ రూమర్స్ మళ్లీ ఊపందుకున్నాయి. అయితే ఈసారి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏమైందంటే..?

Naga Chaitanya
Naga Chaitanya

నాగచైతన్య – శోభిత ధూళిపాళ కలిసి వెకేషన్ కు వెళ్లారట. ఈ ఇద్దరు తాజాగా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన ఫొటోలు చూస్తే నిజమే అనిపించక మానదు. ఎందుకంటే.. ఇద్దరు పోస్టు చేసిన పిక్స్ ఒకేలా ఉన్నాయి. ఒకే ప్రదేశంలో తీసినవిలా కనిపిస్తున్నాయి. దీంతో ఈ లవ్ బర్డ్స్ ప్రపంచం కంట్ల పడకుండా అడవుల్లో తిరుగుతున్నారంటూ.. నెట్టింట రూమర్స్ మొదలయ్యాయి.

- Advertisement -

తాజాగ ఈ జంట విడివిడగా షేర్ చేసిన ఫొటోల్లో నాగచైతన్య తాను జీపులో కూర్చొని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను షేర్ చేశాడు.  మరోవైపు శోభిత పోస్టు చేసిన ఫొటో.. అదే జీపులో ఇంకోవైపున కూర్చొని.. అదే వ్యూని ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది.  అంతే కాకుండా చై కూర్చున్న లొకేషన్ ఫొటోలు, వీడియోలు కూడా పోస్టు చేసింది. కానీ వాటిల్లో చై కనిపించడం లేదు.

ఇందులో ఇంకో విశేషం ఏంటంటే..? శోభిత ఈ ఫొటోలు షేర్ చేసిన మరుసటి రోజు నాగచైతన్య పోస్టు చేశాడు. ఇలా ఈ జంట తమ ప్రేమను ఎంత దాచాలనుకున్నా.. ఇలా ఏదో రకంగా నెటిజన్లకు దొరికిపోతున్నారు. ఈసారైతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతోందట. అయితే సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇస్తారేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here