Badshah : పాకిస్థాన్ నటితో మన స్టార్ సింగర్ డేటింగ్.. అలా దొరికిపోయారుగా

- Advertisement -

Badshah : బాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు పాకిస్థాన్ నటీనటులతో ప్రేమలో పడిన వారున్నారు. బీ టౌన్ అలనాటి తార రేఖ నుంచి అమృతా రావ్, సుస్మితా సేన్, అమృతా అరోరా.. ఇలా చాలా మంది పాకిస్థాన్ నటులు, క్రికెటర్లతో ప్రేమాయణం సాగించారు. కానీ వారి ప్రేమ సరిహద్దులు దాటలేకపోయింది. అంతకుముందు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో.. ముఖ్యంగా పాక్ నటీనటులు, సింగర్స్ వర్క్ చేసేవారు. కానీ గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య పరిస్థితుల వల్ల పాక్ ఆర్టిస్టులకు ఇండియాలో అవకాశాలు రావడం లేదు. అయితే పాకిస్థాన్ నటీనటులతో మాత్రం బాలీవుడ్ వాళ్లకు మంచి సంబంధాలే ఉన్నాయి. కొందరు అక్కడి వారితో ప్రేమలో కూడా పడ్డారు. అలా తాజాగా తెరపైకి వచ్చిన ఓ జంట గురించే ఈ స్టోరీ.

Badshah
Badshah

బాలీవుడ్ బాద్ షా.. అంటే షారుక్ ఖాన్ గురించి కాదండోయ్. సింగర్ కమ్ ర్యాపర్.. బాద్ షా గురించి. ఈ ర్యాపర్ సాంగ్స్ చాలా ఫేమస్. ఏ పార్టీలోనైనా బాద్ షా సాంగ్ ఉండాల్సిందే. ర్యాప్ సాంగ్స్ తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తూ బాద్ షా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తన ప్రొఫెషనల్ లైఫ్ విషయంలోనే కాదు ఈ ర్యాపర్ పర్సనల్ లైఫ్ కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఏంటంటే.. బాద్ షా గత కొంతకాలంగా పాకిస్థాన్ నటితో డేటింగ్ లో ఉన్నాడని రూమర్స్. గతంలో ఈ రూమర్స్ బాగా వ్యాప్తి చెందాయి. కానీ కొంతకాలం నుంచి ఏ చడీచప్పుడూ లేదు. మళ్లీ వీళ్లిద్దరు కలిసి ఉన్న ఓ వీడియో వైరల్ కావడంతో రూమర్స్ ఊపందుకున్నాయి. ఇంతకీ ఆ నటి ఎవరంటే..?

పాకిస్థాన్ ఆలియా భట్ గా పేరు పొందిన హానియా ఆమిర్. ఈ భామ పాక్ లో సూపర్ ఫేమ్. ఓవైపు డ్రామాస్ చేస్తూ మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది. ఈ భామ నటించిన ఇష్కియా, ముజె ప్యార్ హువా థా, మేరే హమ్ సఫర్ వంటి సూపర్ హిట్ డ్రామాల్లో నటించింది. ఈ డ్రామాలు ఇండియాలో కూడా చాలా ఫేమస్. ఇండియాలోనూ హానియాకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే బాద్ షాకు, హానియా రిలేషన్ షిప్ లో ఉన్నారని చాలా కాలం నుంచి రూమర్స్ ఉన్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్ కావడంతో మరోసారి ఇది హాట్ టాపిక్ అయింది.

- Advertisement -

బాద్ షా, హానియా ఆమిర్‌తో ప్రేమలో ఉన్నాడనే న్యూస్ గతేడాది డిసెంబరులో వైరల్ అయింది. హనియా స్వయంగా తన ఇన్ స్టాలో బాద్ షాతో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేయడంతోనే పుకార్లు షురూ అయ్యాయి.  తాజాగా వీళ్లిద్దరూ మరోసారి దుబాయిలో కలిశారు. ఓ కన్సర్ట్ కోసం కలిసినట్టు టాక్. ఈ వీడియోలో ఈ ఇద్దరు కలిసి ఓ పాట పాడుతున్నారు. ప్రస్తుతం వీడియో బాగా వైరల్ అవుతోంది. హానియాకు బాద్ షా మంచి జోడీ కాదని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. క్యూట్ కపుల్ అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

దిల్లీలో పుట్టి పెరిగిన బాద్ షా.. ర్యాపర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత సింగర్‌గానూ బాలీవుడ్‌లో పలు హిట్ సాంగ్స్ పాడాడు. అయితే జాస్మిన్ మాసీ అనే అమ్మాయితో ఎనిమిదేళ్లు కలిసున్నాడు. ఈ జంటకు ఓ పాప కూడా ఉంది. మరి ఏమైందో ఏమో గానీ 2020లో విడిపోయారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here