Indraja – Anchor sowmya : చీప్ గా ఆ విషయంలో గొడవ పడుతున్న ఇంద్రజ, జబర్దస్త్ యాంకర్ సౌమ్య

- Advertisement -

Indraja – Anchor sowmya : బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్.. కొన్ని సంవత్సరాలుగా ఈ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ప్రస్తుతం ఈ కామెడీ షో కి జడ్జ్ గా నటి ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. కృష్ణ భగవాన్ కూడా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో కి యాంకర్ గా సౌమ్యారావు చేస్తుంది. కాగా వచ్చేవారం జబర్దస్త్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. సౌమ్య, ఇంద్రజ ఇద్దరు గొడవపడటం హైలైట్ గా మారింది. దాంతో వీళ్లిద్దరి విషయం హాట్ టాపిక్ గా మారింది.

Indraja - Anchor sowmya
Indraja – Anchor sowmya

వచ్చేవారం శ్రీరామనవమి ఉండడంతో స్పెషల్ ఎపిసోడ్ ను క్రియేట్ చేశారు మేకర్స్. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లోనే యాంకర్ సౌమ్య జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలోని శ్రీదేవి పాత్రలో కనిపించి అదిరిపోయే స్టెప్పులు వేసింది. అంతేకాకుండా ఓ స్కిట్ కూడా చేసింది రా బాబు అనుకుంటూ చెప్పిన డైలాగ్స్ కామెడీ అందరినీ ఆకట్టుకున్నాయి. నూకరాజు, పంచ్ ప్రసాదు కామెడీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.

ఈ ఎపిసోడ్ లో రాకెట్ రాఘవ ఆల్ ఇండియా సినిమాలో మాదిరిగా పాన్ ఇండియా స్కిట్ చేసి ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయించారు. ఇక మిగతా కమెడియన్స్ కూడా ఎవరు స్కిట్స్ వాళ్ళు చేశారు. ప్రతి ఒక్క స్కిట్ లోని హైలెట్స్ తీసుకొని ఓ ప్రోమోనీ డిజైన్ చేశారు. ఇక ప్రోమో అన్నాక సస్పెన్స్ తప్పనిసరి. ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రోమో హిట్ అవ్వడానికి ఈసారి ఇంద్రజ, సౌమ్య రావులను బలి చేశారు.

- Advertisement -

శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా జబర్దస్త్ కమెడియన్స్ లోని ప్రతి ఒక్కరి చేత పానకం తయారు చేయించారు. రాకెట్ రాఘవ చేసిన పానకం ఇంద్రజ కి నచ్చింది. సౌమ్యకి మాత్రం వెంకీ చేసిన పానకం నచ్చింది. దాంతో ఇద్దరి మధ్య చిన్న సంభాషణ జరుగుతుంది. అసలు అందర్నీ డెసిషన్ అడిగేటప్పుడు నన్నెందుకు అడిగావు అని ఇంద్రజ సౌమ్య పై సీరియస్ అవుతుంది. ఇక రాఘవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు . ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో పలువురు నేటిజన్స్ మీ ప్రోమో కోసం చీప్ గా వాళ్ళిద్దరి చేత పానకం కోసం చీప్ గా గొడవపడేలా చేశారా? ఏం ప్రోమో కటింగ్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here