Kamalini Mukherjee : గోదావరి హీరోయిన్ ‘కమలినీ ముఖర్జీ’ ఇంత దారుణంగా తయారు అయ్యిందేంటి..చూస్తే తట్టుకోలేరు

- Advertisement -

Kamalini Mukherjee : అందాల ఆరోబోతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం నటనకి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన హీరోయిన్స్ సక్సెస్ అవ్వడం చాలా అరుదు. అలా సక్సెస్ అయినా హీరోయిన్స్ లో ఒకరు కమిలిని ముఖర్జీ.ఈమె కళ్ళకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు, ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ అర్థవంతమైన సినిమాలే.ఎంతో చక్కగా నటిస్తూ కెరీర్ ని బాగానే నెట్టుకొచ్చింది.

kamalini mukherjee
kamalini mukherjee

ఆనంద్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా ఈమె తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవడం కాదు.’ఉత్తమ నటి’ గా నంది అవార్డు కూడా గెలుచుకుంది.ఇలా మొదటి సినిమాతోనే నంది అవార్డు ని గెలుచుకున్న హీరోయిన్స్ ఇండస్ట్రీ చేతివేళ్ల మీద లెక్కపెట్టొచ్చు.ఇక తర్వాత ఈమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.ముఖ్యంగా శేఖర్ కమ్ముల అనే దర్శకుడు ఈమె కోసం ఎంతో అద్భుతమైన పాత్రలు సృష్టించేవాడు.

అలా ఆమె కెరీర్ లో బెస్ట్ చిత్రాల లిస్ట్ తీస్తే అందులో సగం శేఖర్ కమ్ముల సినిమాలే ఉంటాయి.ఆనంద్, గోదావరి,హ్యాపీ డేస్ ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించడమే కాకుండా, కమిలినీ ముఖర్జీ కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాయి.అలా కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్నప్పుడే రాహుల్ అనే వ్యక్తిని పెళ్ళాడి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.ఆమె చివరగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘పులి మురుగన్’.

- Advertisement -

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరో గా నటించిన ఈ సినిమా 2016 వ సంవత్సరం లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాతే ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఈమె చాలా కాలం తర్వాత ఇటీవలే ఒక ప్రోగ్రాం కి ముఖ్య అతిథి గా హాజరైంది. చాలా కాలం తర్వాత ఆమెని చూసిన అభిమానులు ఒక్కసారిగా కంగు తిన్నారు. లావు గా గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన కమిలిని ముఖర్జీ కి సంబంధించిన కొన్ని ఒక లేటెస్ట్ ఫోటో మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here