Rashmika Mandanna : రష్మిక క్రేజ్ మాములుగా అందులో ఏకంగా మూడో స్థానాన్ని చేరుకుందిగా..

rashmika mandanna


ఒక వైపు వరుసగా సినిమాలు చేస్తునే.. మరో వైపు హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో రష్మిక ( Rashmika Mandanna ) సోషల్ మీడియాలో.. ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఏప్రిల్ 5న రష్మిక బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో రష్మిక పేరు మార్మోగిపోయింది. ఇదే సమయంలో పుష్ప ది రూల్ సినిమా నుంచి స్పెషల్ వీడియో కూడా రిలీజ్ అయ్యింది. ఈ రెండు కారణాలు ఒకే వారంలో జరగడంతో.. రష్మిక పేరు సోషల్ మీడియా(social media)లో ట్రెండింగ్‌లో ఉంది. దీంతో IMBDలో టాప్ సెలబ్రెటీ జాబితాలో చోటు దక్కించుకుంది రష్మిక.

Rashmika Mandanna
Rashmika Mandanna

“గత వారం అభిమానులను రష్మిక బర్త్‌డే జరపడం, పుష్ప2 టీజర్ రావడంతో ఆమె ఐఎండీబీ పాపులర్ ఇండియన్ సెలబ్రటీస్ ఫీచర్‌లో మూడో స్థానంలో నిలిచింది” అని ఐఎండీబీ ట్వీట్ చేసింది. నేషనల్ క్రష్ ఈ అరుదైన ఘనత సాధించడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్విటర్ వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Rashmika Mandanna Photos

ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’లో నటిస్తోంది. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నితిన్ సరసన మరోసారి రష్మిక మందన్న .( Rashmika Mandanna ) రొమాన్స్ చేస్తోంది. ‘రెయిన్‌బో’ అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. ఇక బాలీవుడ్‌లో అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘యానిమల్’ సినిమాలో రణ్‌ బీర్‌ కపూర్‌తో కలిసి నటిస్తోంది. వీటితో పాటు పలు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసింది.