మొన్న చెప్పింది.. ఈరోజు చూపించేసింది. కడుపు ఫొటో పెట్టిన ఇలియానా

- Advertisement -

ఇలియానా.. ఒకప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమలో ఆమె ఒక స్టార్ హీరోయిన్గా అనేక సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగింది. చిన్న వయసులోనే దేవదాసు అనే సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకుంది.తెలుగులో మంచి క్రేజ్ లభించిన తర్వాత హిందీలో కూడా అడుగుపెట్టిన ఆమె అక్కడ కూడా అనేక హిట్ సినిమాల్లో భాగమై మంచి పేరు సంపాదించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు పీక్ లో ఉన్న టైంలోనే బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టి అక్కడికి షిఫ్ట్ అయింది ఈ భామ.

ఇలియానా
ఇలియానా

అలా బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత ఒక విదేశీయుడితో ప్రేమలో పడి చాలా కాలం పాటు బాలీవుడ్ సినిమాలతో పాటు అన్ని సినిమాలకు దూరమై పూర్తిగా ప్రేమ మత్తులోనే మునిగిపోయింది. ఆ తర్వాత అతనితో బ్రేకప్ అయ్యాక మళ్ళీ సినిమాల్లో నటించే ప్రయత్నాలు చేసినా ఆమె ఏ మాత్రం అవకాశాలు అందుకోలేక పోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు, వీడియోలు షేర్ చేస్తూ వస్తున్న ఈ భామ కొద్ది రోజుల క్రితం తల్లి కాబోతున్న అని అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. రెండు వారాల క్రితం తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని చెబుతూ ఒక చిన్నారి డ్రెస్సును అలాగే తన మెడలో మా మమ్మ అని రాసి ఉన్న ఒక లాకెట్ ఫొటోస్ షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇలియానా పెళ్లి చేసుకోలేదని అందరికీ తెలుసు. పెళ్లికాకుండా పిల్లలు ప్లాన్ చేసిందా అని చర్చించుకున్నారు. కనీసం తండ్రి ఎవరో చెప్పాలని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ ఈ విషయాన్ని ఇలియానా పెద్దగా పట్టించుకోలేదు. మెుదట్లో ఇలియానా పెట్టిన ఫొటోను ఏదో సినిమా ప్రమోషన్ కోసం అని అనుకున్నారు. కానీ తాజాగా వీడియోను షేర్ చేసేసరికి ఈ విషయంపై క్లారిటీ వచ్చినట్టైంది. తన బేబీ బంప్ ని చూపిస్తూ.. వీడియోను రికార్డు చేసినట్టుగా ఉంది. పక్కనే పెంపుడు కుక్క పడుకుని ఉండగా.. ఇలియానా తన చేతిలో కాఫీ కప్పును పట్టుకుని.. తన బేబీ బంప్ ను ప్రదర్శించింది. ఇదంతా సరే.. కానీ బిడ్డకు తండ్రి ఎవరనే దానిపై మాత్రం చర్చ నడుస్తూనే ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here