Vishal : మార్క్ ఆంటోనీ సినిమా కోసం సెన్సార్ బోర్డుకు లంచం ఇచ్చాను… హీరో విశాల్ సెన్సేషనల్ కామెంట్స్

- Advertisement -

Vishal : పేరుకు తెలుగు గడ్డకు చెందిన వ్యక్తి అయినా కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు విశాల్. ఆయన నటించిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ ఇక్కడ మార్కెట్ పెంచుకున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం మార్క్ ఆంటోనీ తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆయన తన సినిమా హిందీ వర్షన్ కోసం అక్కడ సెన్సార్ బోర్డులకు లంచం ఇచ్చానని సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ఆఫీసులో తనకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటూ ఓ వీడియోలో తెలియజేశాడు. అలాగే తన దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న వ్యక్తుల పేర్లు.. వారి అకౌంట్ నంబర్లతో సహా సోషల్ మీడియా వేదికగా బయట పెట్టాడు. ఈ విషయం తెలిసిన పలువురు దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్లు ఆశ్చర్యపోతున్నారు.

Vishal
Vishal

ఈ విషయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఇండస్ట్రీలలో చర్చనీయాంశంగా మారింది. అవినీతిని వెండితెర పైన చూపిస్తున్నారు… కానీ నిజజీవితంలో జరుగుతూనే ఉంది.. దీనిని నేను జీర్ణించుకోలేకపోతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు విశాల్. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయం ముంబైలోని..సీబీఎఫ్సీ ఆఫీసులో ఇంత దారుణం జరుగుతోందంటూ ఆగ్రహించారు. మార్కు ఆంటోని సినిమా హిందీ వర్షన్ కోసం.. రూ.6.5 లక్షలు చెల్లించానన్నారు. అందుకు సంబంధించిన లావాదేవీలను రెండుసార్లు చేశానని.. ఒకటి స్క్రీనింగ్ కోసం మూడు లక్షలు.. అలాగే సర్టిఫికెట్ కోసం రూ.3.5 లక్షలు ఇచ్చినట్టుగా చూపారు. తన కెరీర్లో ఇంత వరకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని ఈ రోజు మా సినిమా విడుదలైనప్పటి నుంచి మధ్యవర్తికి ఎక్కువ డబ్బు చెల్లించడం తప్పా మరే మార్గం లేదన్న విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఇలా చేయడం తన కోసం మాత్రమే కాదని.. భవిష్యత్లో రాబోయే నిర్మాతల కోసమంటూ విశాల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

https://publish.twitter.com/?query=https%3A%2F%2Ftwitter.com%2FVishalKOfficial%2Fstatus%2F1707373411175977286&widget=Tweet

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here