Hyper Aadi : శ్రద్ధదాస్ తో శేఖర్ మాస్టర్ డాన్స్.. హైపర్ ఆది ఎక్స్ప్రెషన్స్ హైలైట్..

- Advertisement -

Hyper Aadi : బుల్లితెరపై ప్రసారమవుతున్న డాన్స్ షో లలో ఢీ షో ని మించింది మరొకటి లేదని చెప్పొచ్చు.. ఈ షో ఎప్పటికీ 14 సీజన్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఢీ 15వ సీజన్ నడుస్తోంది.. ఈ షో కి జడ్జెస్ గా శేఖర్ మాస్టర్ హీరోయిన్ శ్రద్ధ వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ షోలో ఫన్ జనరేట్ చేయడానికి హైపర్ ఆది తనదైన పంచులతో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఢీ 15 లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో మొత్తంలో శేఖర్ మాస్టర్ హీరోయిన్ శ్రద్ధ దాస్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చివర్లో హైపర్ ఆది ఇచ్చిన ఎమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే..

Hyper Aadi
Hyper Aadi

ఉగాది సందర్భంగా ఢీ 15 లేటెస్ట్ ప్రోమో డిజైన్ చేశారు.. జలజల జలజల పాతం నువ్వు.. సాంగ్ కి లిఖిత్ తన పార్ట్నర్ తో కలిసి స్టేజ్ పై అదిరిపోయే స్టెప్పులు వేశాడు. పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత లిఖిత్ ఎవరినైనా ఎప్పుడైనా లవ్ చేసావారా .. అని అడిగితే శ్రద్ధ అని సమాధానం చెబుతాడు. దాంతో శ్రద్ధ సిగ్గుపడుతూ ఓ స్మైల్ ఇస్తుంది. ఇక పర్ఫామెన్స్ విషయానికి వస్తే నేను సముద్రం చూస్తా అనుకున్న మీరు సునామీ చూపించారు అని శ్రద్ధ చెబుతుంది.

Comedian Hyper Aadi
Comedian Hyper Aadi

ఇక ఇదే పాటకి శేఖర్ మాస్టర్ హీరోయిన్ శ్రద్ధ డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అంటూ.. ప్రదీప్ అనౌన్స్ చేయగానే.. జలజల జలపాతం నువ్వు పాటకి శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రద్ధదాస్ ఇద్దరు కలిసి బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టెప్పులు వేస్తారు.. వారిద్దరి ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ కి అక్కడ ఉన్నవాళ్లంతా ఫిదా అవుతారు. ఈ ఎపిసోడ్ కట్ కూడా చాలా బాగుంటుంది. శేఖర్ మాస్టర్ శ్రద్ధాదాస్ క్లోజ్ అవుతున్న మూమెంట్స్ ని చూసి హైపర్ ఆది ఓ రేంజ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఇక చివర్లో అంతా అయిపోయింది రా బాబోయ్ అని అనుకునేటట్టుగా.. నెత్తిమీద తన ఖర్చు వేసుకొని దిగాలుగా మొఖం పెట్టిన ఎక్స్ప్రెషన్ అయితే నెక్స్ట్ లెవెల్..

- Advertisement -

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమోలో మరికొన్ని హైలెట్స్ కూడా ఉన్నాయి. ఢీ 10 విన్నర్ మరోసారి డి స్టేజ్ పై డాన్స్ వేయడం.. ఉగాది స్పెషల్ అంటూ పండు డ్రింక్ చేస్తున్న స్పెషల్ వీడియోని పార్ట్స్ పార్ట్స్ గా వేయడం ఆకట్టుకున్నాయి. ఈ ప్రోమో పై మీరు ఓ లుక్కేయండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here