Shivratri Special Movies : శివరాత్రికి థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్న క్రేజీ సినిమాలు ఇవే!

- Advertisement -

Shivratri Special Movies ప్రతీ ఏడాది శివ రాత్రి వచ్చిందంటే ఉపవాసం ఉంటూ శివారాధన చేస్తూ పచ్చి గంగ కూడా ముట్టకుండా రాత్రి మొత్తం జాగారం ఉండడానికి సిద్ధం అవుతాము..ఇంట్లో ఉండేవాళ్ళు రాత్రి మొత్తం మేలుకొని టీవీ లో శివుడిని తల్చుకుంటూ భక్తి సినిమాలు చూస్తుంటారు.ఇక సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన బయ్యర్స్ అయితే స్టార్ హీరోల పాత బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అర్థరాత్రి షోస్ ప్రత్యేకంగా వేసుకుంటారు.

Shivratri Special Movies
Shivratri Special Movies

ఇది ఎన్నో సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తుంది.ఈ శివరాత్రికి కూడా స్టార్ హీరోల క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను ప్రత్యేక షోస్ గా వేసుకుంటున్నారు.ప్రస్తుతం థియేటర్స్ లో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఆడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ చిత్రమే చాలా ప్రాంతాలలో స్పెషల్ షోస్ గా ప్రదర్శితమవుతోంది.ఈ సినిమాతో పాటుగా పలు సూపర్ హిట్ సినిమాలను కూడా శివరాత్రి సందర్భంగా స్పెషల్ షోస్ వేస్తున్నారు..అవేంటో చూద్దాము.

rangasthalam

పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని ఈ శివరాత్రికి అధిక ప్రాంతాలలో ప్రదర్శించబోతున్నారు, అలాగే పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా అత్యధిక ప్రాంతాలలో స్పెషల్ శివరాత్రి షోస్ గా వేస్తున్నారు.ఈ రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.

- Advertisement -
bheemla nayak

వీటితో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్, రామ్ చరణ్ రంగస్థలం, #RRR , మహేష్ బాబు సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఇలా లేటెస్ట్ గా సూపర్ హిట్టైన సినిమాలు మరియు ఆయా హీరోల కెరీర్స్ లో కల్ట్ క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చిన సినిమాలతో ఈ శివరాత్రి థియేటర్స్ మొత్తం కళకళలాడబోతున్నాయి.మరి జనాలు ఏ సినిమాకి ఎక్కువ ఆదరణ చూపిస్తారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here