Urvashi Rautela : స్టార్‌ క్రికెటర్‌తో లవ్ కాంట్రవర్సీ.. హీరో రామ్‌ని మధ్యలోకి లాగిన బాలీవుడ్ బ్యూటీ



బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ( Urvashi Rautela ) గురించి తెలియని వారుండరు. ఈ భామ సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేమస్. నెట్టింట్లో ఈ హాటీ అందాల ఆరబోతకు అడ్డూ అదుపూ ఉండదు. హద్దులు చెరిపేస్తూ ఈ బ్యూటీ తన గ్లామర్ షోతో కుర్రాళ్లకు కైపెక్కిస్తుంది. కేవలం బ్యూటీ ట్రీట్‌తోనే కాదు తరచూ కొన్ని వివాదాలతో ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండేందుకు ట్రై చేస్తూ ఉంటుంది.

Urvashi Rautela / ram Pothineni and Rishab Pant
Urvashi Rautela / ram Pothineni and Rishab Pant

ఊర్వశి రౌటేలా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్‌ రిషబ్ పంత్‌తో లవ్‌లో ఉందంటూ కొన్ని పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు ఊతమిస్తూ ఈ బ్యూటీ తరచూ చేసే పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే దీనిపై రిషబ్ మాత్రం చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. వెంటనే తన రియల్ గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసేశాడు. అయినా ఈ బ్యూటీ తగ్గేదేలే అంటూ తరచూ తన పోస్టులో పంత్ గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది.

Rishab and urvashi

ఊర్వశి టార్చర్ భరించలేక రిషబ్ పంత్ ఆ మధ్య సోషల్ మీడియాలో ఊర్వశి ని బ్లాక్ చేయడం.. ఆ తర్వాత పదే పదే ఊర్వశి రౌతెల్లా తన సోషల్ మీడియా పోస్ట్ లో రిషబ్ పంత్ గురించి ప్రస్థావించడం చేసేది. ఈ మొత్తం వ్యవహారం తో ఊర్వశి కి కావాల్సినంత పబ్లిసిటీ దక్కింది. దాంతో బాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడికి నటించే అవకాశాలు దక్కాయి.

ఇటీవల ఈ అమ్మడు మిస్టర్ ఆర్ పీ అంటూ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ చాలా మంది రిషబ్ పంత్ గురించి అనుకున్నారు. కాని తాజాగా ఈ అమ్మడు స్పందిస్తూ నేను ఆర్ పీ అంటూ పోస్ట్ పెట్టింది రామ్ పోతినేని గురించి. అతడు నా సహ నటుడు. అయితే ఇప్పుడు తెలిసిన విషయం ఏంటీ అంటే రిషబ్ పంత్ ను కూడా ఆర్ పీ అంటారట.

రిషబ్ పంత్ ను కూడా ఆర్ పీ అంటారు అనే విషయం తెలియక నేను అలా పెట్టాను. కానీ నా ఉద్దేశ్యం నేను పెట్టింది మాత్రం రామ్ పోతినేని అన్నట్లుగా ఈ అమ్మడు అనూహ్యంగా రామ్ పోతినేని పేరును వివాదంలోకి లాగింది. సాధారణంగా రామ్ తన సోషల్ మీడియాలో రాపో(RaPo.. Ram Potineni) అని రాస్తుంటాడు. అందరూ కూడా ఇదే ఫాలో అవుతుంటారు. కానీ ఈ బ్యూటీ ఆర్పీ అని కొత్త నిక్‌నేమ్ పెట్టి తన వివాదంలోకి రామ్‌ని లాగేసింది. మరి దీనిపై మన చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని ఎలా స్పందిస్తాడో చూడాలి.