Hrithik Roshan and Prabhas : అడ్డంగా బుక్కైన రాజమౌళి.. ఫ్యాన్స్ మామూలుగా ఆడుకోవట్లేదుగా..

- Advertisement -

Hrithik Roshan and Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిన మూవీ ‘బాహుబలి’. ఇక ఈ మూవీ ఫస్టాఫ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ప్రశ్న ప్రపంచ సినీ ప్రేక్షకులను తెగ ఆలోచనలో పడేసింది. ఈ మూవీతో ప్రభాస్​, రాజమౌళి క్రేజ్​ ఇంటర్నేషన్ స్థాయిలో పెరిగింది. అలానే వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది.

Hrithik Roshan and Prabhas
Hrithik Roshan and Prabhas

బాహుబలి కంటే ముందు ప్రభాస్ తో రాజమౌళి ఛత్రపతి సినిమా తీశాడు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది. అది కాస్త బాహుబలి టైంలో స్ట్రాంగ్ అయింది. ఈ ఇద్దరు పలు సందర్భాల్లో ఒకరిపై మరొకరు తమ అభిమానాన్ని కూడా చాటుకున్నారు. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇందులో ప్రభాస్‌, బాలీవుడ్​ స్టార్​ హృతిక్‌ రోషన్‌లను పోలుస్తూ రాజమౌళి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

Director Rajamouli
Director Rajamouli

ప్రసుత్తం వైరలవుతోన్న ఈ వీడియో 2009లో ప్రభాస్‌ ‘బిల్లా’ సినిమా ఆడియో లాంచ్‌ సందర్భంగా తీసింది. దీంట్లో జక్కన్న మాట్లాడుతూ.. రెండేళ్ల కిందట ‘ధూమ్‌ 2′ విడుదలైనప్పుడు ఆ సినిమా చూసి నేను ఆశ్చర్యపోయాను. కేవలం బాలీవుడ్‌ వాళ్లు మాత్రమే ఇంత గొప్ప క్వాలిటీ సినిమాలు ఎలా తీయగలుగుతున్నారని అనుకునేవాడిని. మన సౌత్​లో హృతిక్‌ రోషన్​ లాంటి నటులు లేరా అని అనుకున్నా.. కానీ ఇప్పుడు బిల్లా సాంగ్స్‌, పోస్టర్స్‌, ట్రైలర్‌ చూశాకా.. ఒక్కటే చెప్పగలను.. ప్రభాస్‌ ముందు హృతిక్‌ రోషన్‌ నథింగ్‌’ అని వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఈ సందర్భంగా తెలుగు సినిమాను హాలీవుడ్‌ లెవల్‌కు తీసుకెళ్లే విధంగా కృషి చేసిన మెహర్‌ రమేష్‌కు థ్యాంక్స్‌ చెబుతున్నా అని అప్పట్లో అన్నారు రాజమౌళి. మరి ఈ వీడియోను నెటిజన్లు ఇప్పుడెందుకు ట్రెండ్​ చేస్తున్నారో తెలీదు కానీ.. విపరీతంగా కామెంట్స్​ పెడుతున్నారు.

- Advertisement -

‘ప్రభాస్‌ టాలెంట్‌ని రాజమౌళి అప్పుడే గుర్తించాడు’, ‘ప్రభాస్‌ ముందు ఏ హీరో అయినా నథింగే’.. అని కొందరు అంటుండగా.. కేవలం సినిమా మీద హైప్‌ తేవడానికే రాజమౌళి అప్పుడు ఇలా మాట్లాడి ఉంటారని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే ఆయన ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె, సలార్​ వంటి భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here