యూట్యూట్ ఇన్ ఫ్యూయెన్సర్ గా కెరీర్ స్టార్ చేసి.. అడపాదడపా చిన్న చిన్న పాత్రలతో సినిమాల్లో నటించింది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో అమ్మడి నటనను చూసి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి వారి ప్రశంసలు అందుకుంది. కోట్లాదిమంది కుర్ర కారు సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయ్యారు. బేబీ సినిమా సక్సెస్ తో వైష్ణవి 4,5 సినిమాల అవకాశాలను కూడా దక్కించుకుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

వాటిలో ఒకటి పూరి జగన్నాథ్ రామ్ కాంబోలో వస్తున్న ఇస్మార్ట్ 2 కూడా ఒకటి. బేబి హిట్ కొట్టినందుకు రామ్ తనకు విషెష్ చెప్పి సర్ ప్రైజ్ గా బోకే కూడా పంపించాడు. పూరి నుంచి కూడా నీకు నా సినిమాలో ఆఫర్ వస్తుందని హామీ ఇచ్చాడట. ఇదే నిజమైతే వైష్ణవి హీరోయిన్ గా తన కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్లడం ఖాయం. ఎందుకంటే ఇస్మార్ట్ 2 పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతుంది. ఇక ఇదే కాకుండా గీత ఆర్ట్స్ లో మరో సినిమాలో నటించేందుకు వైష్ణవి సెలక్ట్ అయిందట. అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాల్లో వైష్ణవిని ఓకే చేశారట. దీనికి బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ కారణమని తెలుస్తోంది.

అంతేకాదు మరో రెండు ఆఫర్లను కూడా సాయి రాజేష్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చారట. దీంతో పాటు తాజాగా మరో రెండు ఆఫర్తు కూడా వచ్చాయట. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఆయన వారుసుడు ఆశిష్ హీరోగా రూపొందుతున్న సినిమాలో చేయబోతున్నారట. ఆశిష్ హీరోగా ఇప్పటికే రౌడీ బాయ్ సినిమాలో నటించాడు. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడు. ఇందులో హీరొయిన్‌గా వైష్ణవిని ఎంపిక చేసినట్లు సమాచారం. అలాగే సిద్దు జొన్నలగడ్డ సరసన మరో సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమా ఇంకా కన్ఫామ్ కాలేదు. కానీ ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ ఫైనలైతే వైష్ణవి చైతన్య టాప్ హీరోయిన్ అవడం ఖాయం.