‘ఆదిపురుష్’ బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు వసూలు చెయ్యాలో తెలుసా..!

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ రేపు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టికెట్స్ కోసం ప్రతీ ప్రాంతం లో స్పెషల్ ఆబ్లిగేషన్స్ పెట్టుకుంటున్నారు. అంత డిమాండ్ ఉంది, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ లో అయితే 3D షోస్ కి ఊహించని రేంజ్ రెస్పాన్స్ వచ్చింది, విడుదలకు రెండు రోజుల ముందే 2D మరియు 3D షోస్ కి కలిపి కేవలం హైదరాబాద్ సిటీ నుండి 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఆదిపురుష్
ఆదిపురుష్

ఇక ఈరోజు అర్థ రాత్రికి అది పది కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అలాగే మొదటి రోజు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా నైజాం ప్రాంతం లో 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వస్తుందని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించాలంటే ఎంత వసూళ్లను రాబట్టాలో ఒకసారి ప్రాంతాల వారీగా చూద్దాం.

Adipurush

తెలుగు తో పాటుగా ఇతర భాషలన్నీ కలిపి ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 230 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డు గా చెప్పుకోవచ్చు, మొదటి రోజు ప్రస్తుతం ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ప్రకారం చూస్తే అన్నీ భాషలకు కలిపి 130 కోట్ల రూపాయిల వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి , బయ్యర్స్ అందరికీ లాభాలు రావాలంటే కచ్చితంగా 230 కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లను రాబట్టాలి.

- Advertisement -
Prabhas

హైప్ ఉంది కాబట్టి , కేవలం వీకెండ్ లోనే 70 శాతం కి పైగా రికవరీ అయిపోతుందని అనుకుంటున్నారు. నైజాం ప్రాంతం లో 50 కోట్లు, సీడెడ్ ప్రాంతం లో 17.5 కోట్లు , వైజాగ్ లో 12.5 కోట్లు, ఈస్ట్ గోదావరి లో 8 కోట్లు, వెస్ట్ గోదావరి లో 7 కోట్లు , నెల్లూరు లో నాలుగు కోట్లు గుంటూరు లో 9 కోట్లు , కృష్ణ జిల్లాలో 7.5 కోట్లు, మొత్తం మీద ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కి కలిపి 115 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలాగే ఓవర్సీస్ లో 30 కోట్లు, హిందీ లో 72 కోట్లు , కర్ణాటక లో 13 కోట్లు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4.5 కోట్లు, మొత్తం మీద ప్రొడక్షన్ ఖర్చులు మరియు ప్రింట్ ఖర్చులతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది ఆదిపురుష్ చిత్రం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here