పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాతగా యాంకర్ ప్రదీప్.. అంత ఎలా సంపాదించాడు?

- Advertisement -

బుల్లితెరపై సక్సెస్ ఫుల్ మేల్ యాంకర్ అంటే ఎక్కువగా వినిపించే పేరు యాంకర్ ప్రదీప్ మాచిరాజు.. నాన్ సింక్ పంచులు, కామెడితో ఎలాంటి షో అయిన కడుపుబ్బా నవ్విస్తూ, జనాలను అల్లరిస్తున్నాడు.. ‘ఢీ’ షో లో సుడిగాలి సుధీర్ తో కలిసి ఆయన చేసిన సందడి ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు, వీళ్లిద్దరి కాంబినేషన్ ఆన్ స్క్రీన్ మీద చూస్తే పొట్టచెక్కలు అవ్వాల్సిందే.. ఇలా తను ఏ షో చేసిన అది ప్రదీప్ వల్ల హిట్ అవుతుంది.. ఒక యాంకర్గా, యాక్టర్ గా రానిస్తూ బాగానే సంపాదిస్తున్నాడు.. అయితే ప్రదీప్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

యాంకర్ ప్రదీప్
యాంకర్ ప్రదీప్

అదేంటంటే.. ప్రదీప్ పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాత అని.. ఇప్పటివరకు పలు షోలకు నిర్మాతగా వ్యవహరించిన ప్రదీప్ ఇప్పుడు సినిమాకు అంటే అంత ఈజీ కాదు.. కొన్ని వందల కోట్ల పైమాటే.. అందులో పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాటలా.. అలాంటి సినిమాను ప్రదీప్ నిర్మించనున్నారని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. అంటే ప్రదీప్ ఒక షో ద్వారా ఎంత సంపాదిస్తున్నాడో అని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ప్రదీప్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాను అని చెప్పడం తో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..

ఇకపోతే ప్రదీప్ ఎన్నో షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. జీ తెలుగు లో ప్రసారమయ్యే ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ అనే ప్రోగ్రాం కి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.. ఆ షో తనకు మంచి పేరును తీసుకొని వచ్చింది. ఇక గత ఏడాది ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రం ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించాడు. అలా హీరో గా , యాంకర్ గా మరియు నిర్మాతగా కూడా సక్సెస్ ని అందుకున్న ప్రదీప్, ఒక సినిమాని నిర్మించాలనే కోరిక ఉందని, తన మొదటి సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే నిర్మిస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు.. అదే ఇప్పుడు వినిపిస్తుంది.. మరి అసలు నిజమేంటో తెలియాలంటే ప్రదీప్ చెప్పే వరకు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here